సరౌండ్ సౌండ్ టెక్నాలజీ తో డాల్బీ వారి ప్రత్యేక సౌండ్ సిస్టం గా 'డాల్బీ అట్మాస్' ప్రత్యేక గుర్తింపు పొందింది. 360 డిగ్రీల నుండి సౌండ్ బాక్సుల ద్వారా సౌండ్ రావడం ఒక ప్రత్యేక అనుభూతిగా ఫీల్ అవుతున్నారు నేటి ప్రేక్షకులు. గతంలో కేవలం హాలీవుడ్ సినిమాలకే పరిమతమైన ఈ టెక్నాలజీ ఇప్పటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే ఇటీవల తెలుగు సినిమాలు కూడా ఈ తరహా మిక్సింగ్ లు చేసి విడుదలకు సిద్ధమవుతున్నాయి.
హైదరాబాద్ లో ఐమ్యాక్స్ లో విశ్వరూపంతో మొదలైన ఈ టెక్నాలజీ ఇటీవల బాహుబలి ని కూడా బాగానే ఆకర్షించింది. ఇప్పటి వరకూ ఐమ్యాక్స్ కి మరియు కొన్ని థియేటర్ లకు మాత్రమే చెందిన ఈ డాల్బీ అట్మాస్ సిస్టం ఇప్పుడు పి.వి.ఆర్ సంస్థ తమకు చెందిన కొన్ని థియేటర్ లలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించనుంది. మొదటి దశలో 50 థియేటర్ లలో ఈ అట్మాస్ సిస్టం ని ప్రారంభించనున్నట్టు సమాచారం.