బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ సినిమాస్ అక్టోబర్ 8 నుంచి 11 వరకూ నాలుగు రోజుల పాటు అమితాబ్‌కు చెందిన 11 సినిమాల్ని రీ-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. `బచ్చన్ బ్యాక్ టు ద బిగినింగ్` పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించి సినిమాల్ని ప్రదర్శించారు. దీనిలో భాగంగా కొన్ని ప్రత్యేక క్లాసిక్ ఐకానిక్ హిట్స్ ని ఎంపిక చేసి మరి తెచ్చారు.
దేశవ్యాప్తంగా 17 నగరాల్లోని తమ 22 పీవీఆర్ సినిమాస్‌లో వీటిని ఎంతో గ్రాండియర్ గా రిలీజ్ చేసారు. అన్ని సినిమాలను చూడాలనుకునే అభిమానులకు కూడా ఒకే పాస్ ని సైతం ఏర్పాటు చేసింది. మెట్రో పాలిటన్ సిటీస్ లో ఆ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. అమితాబ్ పాత అభిమానులతో థియేటర్లు కళకళలాడాయి.
ముంబైలోని పీవీఆర్ జుహులో అమితాబ్ బచ్చన్‌కు చెందిన ఫొటోలు.. పోస్టర్ల ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పీవీఆర్ సినిమాస్ చేపట్టిన ఈ స్పెషల్ ప్రోగ్రామ్ అమితాబ్‌కు ఎంతో నచ్చింది. ఇది గడిచిపోయిన ఆ శకాన్ని మళ్లీ కళ్ల ముందుకు తెస్తుందని బిగ్ బీ ఉద్విగ్నంగా స్పందించారు.
తాజాగా మరో బాలీవుడ్ లెజెండ్ కు ఘన నివాళులు అర్పించేందుకు పీవీఆర్ సిద్ధమైంది. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ అభినయ్ సామ్రాట్‌గా పేరుగాంచిన దివంగత లెజెండ్ దిలీప్ కుమార్ మైలురాయి సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన 100వ జన్మదిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినిమా చైన్ `అయాన్`..` దేవదాస్`..` రామ్ ఔర్ శ్యామ్` మరియు `శక్తి` చిత్రాలను డిసెంబర్ 10 మరియు 11 తేదీలలో దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 30 పీవీఆర్ స్క్రీన్‌లలో ప్రదర్శించాలని నిర్ణయించింది.
దానికి సంబంధించిన ఏర్పాట్లను అప్పుడే పీవీఆర్ మొదలు పెట్టేసింది. లెజెడ్స్ ని ఈ రకంగా గుర్తు చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే పాత చిత్రాల్నిమళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. పీవీఆర్ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చే స్తున్నారు. మేటి క్లాసిక్ హిట్స్ ని మళ్లీ తమకి అందిస్తున్నందుకు పీవీర్ఆకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.