థియేటర్లకు సర్వీస్ ప్రొవైడర్ల రూపంలో భారీ బిల్లులు తడిసి మోపెడైపోతున్నాయన్న ఆవేదన చాలా కాలంగా ఉంది. రేట్లు తగ్గాలన్న నివేదన నిర్మాతల నుంచి నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. కానీ క్యూబ్ వంటి సర్వీసుల్లో ఛార్జీల తగ్గింపు అనేది సాధ్యపడనిది. అయితే ప్రస్తుత క్రైసిస్ పరిస్థితుల్ని సర్వీస్ ప్రొవైడర్లు అర్థం చేసుకుని ఎగ్జిబిటర్ కు బాసటగా నిలిచేందుకు సిద్ధమవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. మార్కెట్ ని లీడ్ చేస్తున్న క్యూబ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (DSP) లో మార్పు స్పష్ఠంగా కనిపిస్తోంది. ఈ కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త విడుదలల కోసం వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) ను 50% డిస్కౌంట్ ఇచ్చేందుకు ప్యాకేజీని ప్రకటించింది. ఇది నిర్మాతలు పంపిణీదారులకు ఎంతో సహాయపడుతుంది. ఈ స్పెషల్ ప్యాకేజీ లాక్ డౌన్ కష్టతరమైన కాలంలో కొత్త సినిమాలను విడుదల చేసేవారికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఈ ఆఫర్ 2020 డిసెంబర్ 31 వరకు కనీసం ఏడు ప్రదర్శనల బిల్లింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.
మహమ్మారీ క్రైసిస్ తర్వాత థియేటర్ యాజమాన్యాలకు నిర్మాతలకు ఇది తొలి శుభవార్త అనే చెప్పాలి. రాబోయే కొద్ది రోజుల్లో మిగిలిన డీఎస్పీలు కూడా 50శాతం తగ్గింపును అనుసరిస్తారని భావిస్తున్నారు. అక్టోబర్ 15 (రేపు) నుండి 50% ఆక్యుపెన్సీ పరిమితితో థియేటర్లను తిరిగి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే అటు ఏపీ.. ఇటు తెలంగాణ ప్రభుత్వం సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లను తెరవడానికి ఇంకా అనుమతించలేదు. రేపటికి ఏపీ తెలంగాణలో థియేటర్లు తెరిచే వీల్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.