క్వీన్ అంటే కష్టాలు ఉండవని అనుకుంటాం కానీ.. దక్షిణాది క్వీన్ కు బోలెడన్ని సమస్యలు వస్తున్నాయి. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన కంగనా రనౌత్ మూవీ క్వీన్ ను.. సౌత్ లోని అన్ని భాషల్లో రీమేక్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రకరకాల మాటల తర్వాత చివరకు... తమిళ్ క్వీన్ లో తమన్నా.. మలయాళంలో అమలా పాల్.. కన్నడలో పరుల్ యాదవ్ ను లీడ్ రోల్ గా రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు.
అంతా బాగానే ఉంది కానీ.. తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే సమస్య తీసుకొచ్చింది. కాజల్ ను లీడ్ గా తీసుకుని సినిమా షూటింగ్ ఫినిష్ చేసేద్దామన్న సందర్బంలో.. ఇప్పుడు నిర్మాణ సంస్థ గోల్డెన్ క్రాబ్ ప్రొడక్షన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. క్వీన్ రీమేక్ ను సౌత్ లోని అన్ని భాషల్లో ఈ సంస్థ సహ నిర్మాణం చేయనుంది. అయితే.. క్వీన్ తమిళ్.. కన్నడ వెర్షన్ లకు రమేష్ అరవింద్ దర్శకత్వం చేయడం అన్నది గోల్డెన్ క్రాబ్ కు నచ్చలేదు. పైగా లీడ్ హీరోయిన్ ఎవరో తేలకుండానే మే నెలలో ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించేశారు. అది కూడా సహ-నిర్మాతగా వ్యవహరించాల్సిన త్యాగరాజన్.. కొన్ని సీన్లను పిక్చరైజ్ చేసి అధికారికంగా క్వీన్ రీమేక్ షూటింగ్ ప్రారంభమైందని అనేశారు.
వీటికి తోడు తన కూతురు ప్రీతి పేరును నిర్మాతల్లో ఒకరిగా చేర్చారు. తాజాగా జరుగుతున్న సంఘటనలు ఏవీ ఇవన్నీ గోల్డెన్ క్రాబ్ సంస్థకు నచ్చలేదు. అయితే.. రైట్స్ తీసుకున్న దగ్గర నుంచి మూడేళ్లలోపే సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉంటుందని.. ఆ గడువు జూన్ నెలలో ముగిసిపోనుండడంతో.. షూటింగ్ మొదలుపెట్టామని త్యాగరాజన్ చెబుతున్నారు. రీమేక్ హక్కులు పోగొట్టుకోకుండా ఉండేందుకే ఇలా చేశామని.. తాము అగ్రిమెంట్ కు భిన్నంగా ఎలాంటి పనులు చేయలేదన్నది ఆయన వాదన. మరోవైపు లీడ్ రోల్ లో నటించేందుకు తమన్నాను ఒప్పించే ప్రయత్నాలు ఇంకా సాగుతున్నాయని టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/