పైరసీ చూసి హీరోకు కామెంట్ పెట్టిన నెటిజన్‌

Update: 2022-07-11 08:30 GMT
మాధవన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన 'రాకెట్రీ' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల అయిందో లేదో అప్పుడే పైరసీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈమద్య కాలంలో పైరసీ గురించి మీడియాలో ఎక్కువగా చర్చ జరగడం లేదు కాని మాధవన్ రాకెట్రీ ప్రమోషన్ సందర్బంగా సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్ సందర్బంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ఒక వ్యక్తి ట్విట్టర్ లో... మాధవన్‌ నటన పై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో దర్శకుడిగా మొదటి సినిమా అయినా కూడా అదరగొట్టేశారు అన్నాడు. క్లైమాక్స్ సీన్స్ ను మళ్లీ మళ్లీ చూశాను. సినిమా లో క్లైమాక్స్ నాకు బాగా నచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఆ ట్వీట్ కు మాధవన్ అనూహ్యంగా స్పందించాడు.

క్లైమాక్స్ సన్నివేశాలను మీరు మళ్లీ మళ్లీ ఎలా చూడగలిగారు అన్నట్లుగా ప్రశ్నించాడు. మాధవన్‌ ప్రశ్నకు చాలా మంది పైరసీ చూసి ఉంటాడు అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయిన వెంటనే పైరసీ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. కానీ పైరసీ చూసి ఏకంగా అభిమాని ని అంటూ హీరో కు మెసేజ్ పెట్టడం మామూలు విషయం కాదంటూ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.

పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ ఎంతో నష్టపోతుందనే విషయం అందరికీ తెలుసు. సినిమా పైరసీ కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం ఉండటం లేదు. అందుకే పైరసీ సినిమా ను చూడొద్దంటూ అభిమానులకు హీరోలు హీరోయిన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. అసలైన సినీ ప్రియులు.. ప్రేమికులు అయితే పైరసీ చూడనే చూడరు.

ఇండస్ట్రీలో పైరసీ వల్ల ఒకప్పుడు ఎంతో నష్టపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఓటీటీ సినిమాలు మరియు థియేట్రికల్‌ రిలీజ్ అయిన సినిమాలు వెబ్ మీడియా ద్వారా చాలా స్పీడ్ గా పైరసీ అవుతున్నాయి. ఎంతగా ప్రయత్నించినా కూడా సినిమా పైరసీని అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా పైరసీ చూసి హీరోకే మెసేజ్ పెట్టిన విషయం వైరల్‌ అవుతోంది.
Tags:    

Similar News