టాలీవుడ్ కి రాబోయే సంక్రాంతి మహా రంజుగా మారిపోయిన సంగతి తెలిసిందే! పెద్ద పండుగ కావడంతో ఈ సీజన్ లో సినిమాల విడుదలకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. ఈ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని.. ముందుగానే పలువురు మూవీ మేకర్స్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేశారు. కానీ ఇప్పుడు సడెన్ గా సంక్రాంతి రేస్ లో నేను కూడా ఉన్నానని అంటున్నాడు ఆర్. నారాయణమూర్తి.
విప్లవ చిత్రాలతో ఆకట్టుకునే ఈయన.. ఇప్పుడు బ్లాక్ మనీపై పోరాటం థీమ్ తో కానిస్టేబుల్ వెంకట్రామయ్య మూవీ చేశాడు. జయసుధ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి బిచ్చగాడు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడు. అయితే.. షూటింగ్ పూర్తయిపోతుండడంతో.. సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికే పొంగల్ పోటీ పీక్ స్టేజ్ లో ఉంది. సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150.. బాలకృష్ణ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.. శర్వానంద్ నటించిన శతమానం భవతి రిలీజ్ లను.. ఐదారు నెలలకు ముందే సంక్రాంతి విడుదల అని చెప్పేశారు.
అందుకు తగ్గట్లుగానే రిలీజ్ అవుతున్నాయి కూడా. మరోవైపు దీపికా పదుకొనే నటించిన హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్ కూడా జనవరి 14నే రానుంది. మరి.. ఇన్ని భారీ సినిమాల మధ్య కానిస్టేబుల్ మూర్తిగారికి థియేటర్లు దొరుకుతాయా అనేదే అసలు పాయింట్. లేకపోతే బిచ్చగాడు టైపులో.. దొరికిన అరాకొరా థియేటర్స్ తోనే సరిపెట్టేసుకుని మంచి టాక్ వచ్చాక స్క్రీన్ కౌంట్ పెంచుకోవచ్చని ఆలోచిస్తున్నారో అర్థం కాని విషయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/