మూర్తి గారు.. హిట్ కొడతారా?

Update: 2016-03-08 22:30 GMT
తెలుగు సినిమా రంగం ఎన్ని రకాల మలుపులు తిరుగుతున్నా.. తను నమ్మిన సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి, ఆ జోనర్ లోనే సినిమాలు తీస్తున్న ఏకైక వ్యక్తి ఆర్. నారాయణ మూర్తి. కమర్షియల్ సినిమాల్లో కేరక్టర్లు చేస్తే, భారీ పారితోషికం ఇస్తామంటూ ఆఫర్ వచ్చినా సరే.. వాటిని కాదని, తన సినిమాలే తీసుకుంటున్నారీయన. ప్రస్తుతం ఈయన దండకారణ్యం అనే సినిమాను పూర్తి చేసి, రిలీజ్ కి రెడీ చేశారు కూడా.

దండకారణ్యంలో ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులు దోచుకోవడం, గిరిజనులకు అన్యాయం జరగడం అనే కాన్సెప్ట్ తో... నారాయణ మూర్తి కొత్త  సినిమా తెరకెక్కింది. రీసెంట్ గా రిలీజ్ అయిన పాట‌ల‌కు స్పంద‌న బాగుందని..  గ‌ద్దర్‌, వందేమాత‌రం శ్రీనివాస్ పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు నారాయణ మూర్తి.

'మన దేశంలో దాదాపు 12.13 రాష్ట్రాల‌ను ఆనుకుని ఉన్న ప్ర‌దేశం దండ‌కార‌ణ్యం. అక్క‌డ ఎక్కువ‌గా గిరిజ‌నులు ఉన్నా.. ఇప్పుడా ప్రదేశమంతా అగ్నిగుండంగా మారుతోంది. ఆదివాసీల ప్రాణాలు పోతున్నాయి. ప్రైవేటు కంపెనీలకు ఖ‌నిజ సంప‌ద‌ను ఇచ్చేయడంతో పోరాటాలు జ‌రుగుతున్నాయి. ఢిల్లీలో ఓ ఘ‌ట‌నపై పార్ల‌మెంట్‌ లో చర్చిస్తే...  దండ‌కార‌ణ్యం గురించి జ‌ర‌గాలి. ఇక్కడి చావులు ఎందుకనే విష‌యం ఆలోచించాలి' అంటున్నారు నారాయణ మూర్తి.

ఈ కాన్సెప్ట్ తోనే.. తనే కథ అందించడంతో పాటు స్క్రీన్ ప్లే, మాట‌లు - ఎడిటింగ్‌ - డ్యాన్స్ - కెమెరా - స‌ంగీతం - నిర్మాణంతో పాటు.. దర్శకత్వం కూడా తానే వహించారు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి.

Tags:    

Similar News