ఒరేయ్ రిక్షా - ఎర్ర సైన్యం - అర్థరాత్రి స్వతంత్ర్యం వంటి విప్లవ సినిమాల్ని తరకెక్కించి హిట్లు కొట్టిన దర్శకహీరో ఆర్.నారాయణమూర్తి. కమ్యూనిజం భావజాలంతో ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ సామాన్య ప్రజల్ని ఎంతగానో అలరించాయి. లెఫ్టిస్టు భావజాలం మూర్తిగారి బలం. ఆ బలంతోనే ఆయన తుదికంటా సినిమాలు తీశారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పోరు తెలంగాణ - వీర తెలంగాణ వంటి సినిమాల్ని తెరకెక్కించి హిట్లు కొట్టారు. పరిమిత వనరులతో సినిమాలు తీసి హిట్లు కొట్టడం మూర్తిగారి ప్రత్యేకత. అయితే మూర్తిగారు ఈ సుదీర్ఘ పయనంలో అన్నీ మర్చిపోయారు. ముఖ్యంగా పెళ్లి గురించి మర్చిపోయారు.
వయసులో ఉన్నప్పుడే పిల్లను వెతుక్కుని పెళ్లాడకుండా తప్పు చేశారు. ఆ సంగతిని ఆయనే చెప్పారు. ఇప్పుడు ఆయన 60వ పడిలోకి వచ్చి పడ్డారు. ఇప్పుడు తెలుస్తోంది తమ్ముడూ.. వయసులో ఉన్నప్పుడు ఏం తప్పు చేశానో.. జ్వరం వచ్చినా, రోగం వచ్చినా నాకంటూ తోడు నీడా లేదు. ఇప్పుడున్న యువతరం పెళ్లి విషయంలో తప్పు చేస్తున్నారు. ఆలస్యం చేస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు అంటూ రియలైజేషన్ గురించి మాట్లాడారు. కుర్రాళ్లూ వింటున్నారా? పెళ్లి గురించి నారాయణ మూర్తి గారు చెప్పింది?