థియేటర్స్ రచ్చ ఇద్దరు సీఎంలు తీర్చాలట

Update: 2017-01-17 05:30 GMT
విషయాన్ని విషయంగా చూడకపోవటం ఇక్కడొచ్చే సమస్య. సినిమా అన్నది కళ.. అది.. ఇది.. అంటూ గొప్ప మాటలు చాలానే చెప్పినా.. ఈ మూడు అక్షరాలు.. మనీ అనే రెండు అక్షరాలతో ముడిపడి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతా బాగున్నప్పుడు సమస్యలు గుర్తుకు రాని వారు.. కొన్ని సందర్భాల్లో మాత్రమే సమస్యలు గుర్తుకు వస్తుంటాయి. తన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా విడుదల సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని చిత్ర కథానాయకుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న సినిమాలకు థియేటర్స్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకనిర్ణయం తీసుకోవాలని.. అప్పుడు మాత్రమే చిన్న సినిమా బతుకుతుందని ఆయన చెబుతున్నారు. తన తాజా సినిమా టాక్ బాగున్నా.. థియేటర్లు లేని కారణంగా ఎవరూ చూడలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. తమ సినిమాను స్టార్ట్ చేసిన వేళలోనే.. తమ సినిమా సంక్రాంతికి వస్తుందన్న విషయాన్ని వెల్లడించామని..కానీ.. థియేటర్లు మాత్రం తమకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నైజాంలో తమకు 23 థియేటర్లు లభించాయని.. ఆంధ్రాలో మాత్రం ఒక్కటంటే ఒక్క థియేటర్ దొరకలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. కానీ..ఆయన సైతం ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు. కళగా కాకుండా పూర్తిస్థాయి కమర్షియల్ గా మారిపోయన సినిమా రంగంలో డబ్బులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని.. మరింకేమీ ఉండదన్న నిజాన్ని ఏళ్లకు ఏళ్లుగా ఉంటున్న వారు ఎందుకు అర్థం చేసుకోరు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News