మాచ‌ర్ల సెంట‌ర్లో.. అద‌ర‌గొట్టిన నితిన్ - అంజ‌లి

Update: 2022-07-09 15:42 GMT
నితిన్ హీరోగా న‌టిస్తున్న పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లు గా న‌టిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ద‌శ‌లో వుంది. ఆగ‌స్టులో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేసింది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ లిరిక‌ల్ వీడియోల‌ని రిలీజ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇప్ప‌టికే విడుద‌లైన `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. దీంతో ఈ మూవీపై స‌ర్వ‌త్రా బ‌జ్ క్రియేట్ అయింది. ఇదిలా వుంటే ఈ మూవీ నుంచి హీరో నితిన్‌, అంజ‌లిల‌పై చిత్రీక‌రించిన స్పెష‌ల్ సాంగ్ గా `మాచ‌ర్ల సెంట‌ర్లో..రారా రెడ్డి ఐ యామ్ రెడీ..` అంటూ సాగే సాంగ్ కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని జూలై 9 శ‌నివారం రిలీజ్ చేశారు.

ముందు ఈ సాంగ్ ని శ్రీ‌కాకుళంలోని ఎన్టీఆర్ మున్సిప‌ల్ స్కూల్ గ్రౌండ్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఆకాల వ‌ర్షాల కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్ కు మార్చారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. లిప్సిక ఆల‌పించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సాంగ్ ప్రోమో ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ త‌న‌దైన సిగ్నేచ‌ర్ స్టెప్స్, అంజ‌లి త‌న గ్లామ‌ర్ తో ర‌చ్చ చేస్తే .. నితిన్ ఎన‌ర్జీ, ఊర మాస్‌ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేశాడు.

తొలి సారి `స‌రైనోడు` మూవీలో ఐట‌మ్ సాంగ్ తో ఆక‌ట్టుకున్న అంజ‌లి మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఈ మూవీలో మ‌రోసారి ఐట‌మ్ భామ‌గా గ్లామ‌ర్ ని ఒల‌క‌బోస్తూ ర‌చ్చ చేసింది. గ‌తంలో కంటే మ‌రింత గ్లామ‌ర్ గా క‌నిపించి మాస్ స్టెప్పుల‌తో హంగామా చేసింది. ఇక సాంగ్ చివ‌ర్లో `రాను రానుంటేనే చిన్న‌దో..` అంటూ `జ‌యం` మూవీలోని బిట్ ని జ‌ర‌చేర్చి నితిన్ ఫ్యాన్స్ కు మ‌రింత జోష్ ని అందించే ప్ర‌య‌త్నం చేశారు. పెప్పీ నంబ‌ర్ గా థియేట‌ర్ల‌లో ఈ పాట ప్రేక్ష‌కుల్ని ఓ రేంజ్ లో ఎంట‌ర్ టైన్ చేస్తూ స్టెప్పులేయించ‌డం ఖాయం అని తెలుస్తోంది.

ఇదే పాట‌లో ఇంటెన్స్ యాక్ష‌న్ సీక్వెన్స్ ల‌ని కూడా చూపించారు. ఈ పాట కోసం ప్ర‌త్యేకంగా వేసిన జాత‌ర సెట్ మ‌రింత రిచ్ గా వుండి పాట‌ని మ‌రింత హైలైట్ అయ్యేలా చేసింది. హీరో నితిన్ తొలిసారి క‌లెక్ట‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించిన ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

నితిన్ మేకోవ‌ర్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ప్ర‌సాద్ మూరెళ్ల ఫొటోగ్ర‌ఫీ, తిరుమ‌తి మామిడాల డైలాగ్స్‌, సాహి సురేష్ ఆర్ట్, వెంక‌ట్‌, ర‌వివ‌ర్మ‌, అన‌ల్ అర‌సు యాక్ష‌న్ సీక్వెన్సెస్, నితిన్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నున్నాయి. హై వోల్టేజ్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ ఆగ‌స్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.



Full View
Tags:    

Similar News