విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటై ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు ప్రామిసింగ్ వెర్సటైల్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన చిత్రం `గాడ్సే`. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సి. కల్యాణ్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని జూన్ 17న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది.
ఇందులో భాగంగా మంగళవారం `రా రమ్మంది ఊరు రయ్యిందీ హుషారు` అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేసింది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటని పాపులర్ సింగర్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల ఆలపించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఈ పాటని హీరో చాలా ఏళ్ల తరువాత సొంత ఊరికి వచ్చిన సందర్భంలో తన చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటే వారెలా రియాక్ట్ అయ్యాలనే విషయాలని చర్చిస్తూ ఈ పాటని అందంగా మలిచారు.
దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి - సత్యదేవ్ ల కలయికలో వస్తున్న రెండవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కలయికలో `బ్లాఫ్ మాస్టర్` రూపొందింది. హీరోగా సత్యదేవ్ కు, దర్శకుడిగా గోపీ గణేష్ పట్టాభికి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఆ మూవీ తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది. టైటిల్ ప్రకటించిన దగ్గరి నుంచి ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో `గాడ్సే` మూవీని దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కించారు.
ఈ చిత్రాన్ని గోపీ గణేష్ పట్టాభి డైరెక్ట్ చేయడం తో పాటు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సత్యదేవ్ లుక్, నటన, సునీల్ కశ్యప్ సంగీతం, సురేష్ ఏ ఎస్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్రధాన హైలైట్ లుగా నిలవనున్నాయి. అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒంటిచేత్తో ఎదుర్కోగల యువకుడిగా సత్యదేవ్ ఇందులో నటించారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనరిపించనుంది. బ్రహ్మాజీ, సిజ్జూ మీనన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ జూన్ 17న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Full View