హీరోయిన్‌ రాయ్‌ లక్ష్మీకి కరెంట్‌ కష్టాలు

Update: 2019-07-17 04:41 GMT
తెలుగు.. తమిళంతో పాటు హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మి. సౌత్‌ నుండి ఇటీవలే బాలీవుడ్‌ కు వెళ్లిన రాయ్‌ లక్ష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌ గా ఉంటుంది. ఈ అమ్మడు ఎప్పుడు కూడా ట్విట్టర్‌ లో తన సినిమా అప్‌ డేట్స్‌ మరియు తన హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. కాని ఈసారి మాత్రం ఆశ్చర్యంగా తనకు వచ్చిన ఒక కష్టంను జనాలతో షేర్‌ చేసుకుంది. ఆమెకు కరెంట్‌ కష్టాలు గత కొన్ని నెలలుగా వెంటాడుతున్నాయట.

అదానీ గ్రూప్‌ నుండి ఈమె కరెంట్‌ ను వాడుతుందట. గత కొన్ని నెలలుగా తన కరెంటు బిల్లు నేను ఎంతైతే పే చేస్తున్నానో తర్వాత నెల దానికి డబుల్‌ వస్తుంది. గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నా సమస్యను చెప్పేందుకు అదానీ గ్రూప్‌ కస్టమర్‌ కేర్‌ కు కాల్‌ చేస్తే ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. నాలా ఎంత మంది ఇలాంటి బాధ పడుతున్నారో? ఈ కష్టం నుండి నన్ను ఎవరైనా గట్టెక్కించగలరా.. కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా పోతుంటే చాలా బాధగా ఉంటుందని రాయ్‌ లక్ష్మి ఆవేదనతో ట్వీట్‌ చేసింది.

రాయ్‌ లక్ష్మి క్షణాల్లో వైరల్‌ అయ్యింది. ఆమె ట్వీట్‌ కు అనూహ్య స్పందన వచ్చి వెంటనే అదానీ గ్రూప్‌ వారు కూడా స్పందించారు. అసౌకర్యానికి చింతిస్తున్నాం.. దయచేసి మీ వివరాలను తెలియజేస్తే సమస్య ఏంటో గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం అంటూ రీ ట్వీట్‌ చేయడం జరిగింది. మూడు నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యకు సోషల్‌ మీడియాకు రాగానే వెంటనే పరిష్కారం లభించినందుకు రాయ్‌ లక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది.
Tags:    

Similar News