ఎయిడ్స్ బాధిత చిన్నారులతో రాశి దీపావళి

Update: 2016-10-31 11:30 GMT
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో.. స్నేహితులతో.. మనవారితో జరుపుకునేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తారు. కానీ ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం.. తన మంచి మనసును చాటింది. ఎయిడ్స్/హెచ్‌ ఐవీ బాధిత చిన్నారులతో పండుగ చేసుకుని.. వారిలో స్ఫూర్తిని నింపింది. అంత మంచి మనసున్న హీరోయిన్ ఎవరో కాదు.. రాశి ఖన్నా.

హైద్రాబాద్ పరిసరాల్లోని డిజైర్ సొసైటీలో రాశి ఖన్నా దీపావళి పండుగ చేసుకుంది. అక్కడ ఉన్న బాధిత చిన్నారులు అందరితో కలిసి సంబరాలు చేసుకుంది. వారిలో స్ఫూర్తి నింపడం అంటే.. ఓసారి పలకరించేసి.. నాలుగు ఫోటోలు దిగేసి వెళ్లిపోవడం కాదు.. అక్కడే అర్ధరాత్రి వరకూ ఉండి.. వారితో పాటలు పాడించి.. డ్యాన్సులు చేయించి.. తను కూడా వారితో పాటు డ్యాన్సులు వేసి అల్లరి చేసింది ఈ బెల్లం శ్రీదేవి.

చిన్నారులకు స్వీట్లు పంచి.. వారిని మనసారా హత్తుకుని ధైర్యం చెప్పి.. వారితో కలిసి టపాసులు పేల్చింది రాశి ఖన్నా. చిన్నారులు అందించిన మిఠాయిలను తన నోటితో అందుకుని.. వారికి ఆనందం పంచడమే కాదు.. ఎందరికో స్ఫూర్తి నింపిన రాశి ఖన్నాకు.. ఇప్పుడు బోలెడన్ని అభినందనలు దక్కుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News