టాలీవుడ్ లోకి వచ్చిన భామ కోలీవుడ్ కి వెళ్లకమానదు. కోలీవుడ్ లో మెరిసన భామ టాలీవుడ్ కీ రాక తప్పదు. రెండు ఇండస్ట్రీలో కథానాయికల్ని ఇచ్చి పుచ్చుకోవడంలో ముందున్నాయి. అయితే రాశిఖన్నా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైంది. కానీ ఆమె ఇప్పటిదాకా తమిళంలో సినిమా చేయలేదు. మీడియా ఆమెని ఎప్పుడు కలిసినా తమిళంలోకి వెళ్లే ఆలోచనేమైనా ఉందా అని అడుగుతుంటుంది.
అయితే రాశి మాత్రం ఛాన్స్ వస్తే చూద్దాం అని చెబుతుండేది తప్ప - ఛాన్సుల కోసం మాత్రం ప్రయత్నిస్తున్నట్టు అనిపించేది కాదు. ఎట్టకేలకి తాజాగా రాశికి కూడా కోలీవుడ్ పై మనసు పడ్డట్టుంది. అందుకే ఓ సినిమా ఒప్పేసుకొంది. సిద్ధార్థ్ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కనున్న చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా ఎంపికైంది. ఆ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలుంటాయి కాబట్టి రెండు మార్కెట్లకి తగ్గట్టుగా ఉంటుందనే రాశిని ఎంపిక చేసుకొన్నారట. అక్కడ్నుంచి ఆఫర్ రావడంతో `నేను తమిళంలోకి వెళుతున్నానోచ్` అంటూ సంబరాలు చేసుకొంటోంది రాశి. మరి తెలుగును నేర్చుకొన్నట్టుగానే తమిళం కూడా నేర్చుకొని వచ్చేస్తుందేమో చూడాలి. తమిళం నేర్చుకోవడమొక్కటే ఏంటి? రాశిఖన్నాలాంటి హుషారైన భామలు పనిలో పనిగా చెన్నైలో కూడా ఓ ఇల్లు కట్టుకొని వచ్చినా వచ్చేయొచ్చు.