బెల్లం శ్రీదేవిగా సుప్రీమ్ మూవీలో రాశి ఖన్నా పంచిన నవ్వులను టాలీవుడ్ ఆడియన్స్ ఇప్పటిలో మర్చిపోవడం కష్టం. క్రేజీ ప్రాజెక్టులు పట్టుకోవడంలో ఈ మధ్య బాగానే సక్సెస్ అవుతున్న ఈ భామ.. మలయాళీ సినీ పరిశ్రమలో కూడా అరంగేట్రం చేసేస్తోంది.
బి. ఉన్నికృష్ణన్ దర్శకుడుగా.. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో రాశిఖన్నాను తీసుకున్నారు. కొన్ని వారాల క్రితమే ఈమె వెర్షన్ షూటింగ్ కూడా మొదలైపోగా.. మరి కొన్ని రోజుల్లోనే రాశి ఖన్నా పాత్రకు సంబంధించిన పార్ట్ పూర్తయిపోనుందట. ఇప్పుడీ సినిమా గురించి.. రాశి ఖన్నా రోల్ గురించి కొత్త అప్ డేట్ ఏంటంటే.. ఈమె చేస్తున్నది ఓ నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. టాప్ హీరోయిన్ రేసులో ఉన్న సమయంలో నెగిటివ్ రోల్ చేసేందుకు సై అనడం అంటే.. రాశి ఖన్నా డేరింగ్ ని పొగడాల్సిందే.
కానీ ఈ సినిమాలో తన పాత్ర గురించి వినగానే విపరీతమైన ఎగ్జైట్మెంట్ కు గురైన రాశి ఖన్నా.. నెగిటివ్ రోల్ కావడంతోనే ఇమ్మీడియేట్ గా సైన్ చేసిందని అంటున్నారు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో.. విశాల్.. హన్సికలు కూడా నటిస్తుండడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/