టాలీవుడ్ యంగ్ బ్యూటీ రాశి ఖన్నా ఇప్పుడు జోష్ మీదుంది. గతంలో కూడా ఈ హీరోయిన్ హిట్స్ సాధించినా.. ఈ సమ్మర్ అమ్మడికి బాగా స్పెషల్. మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ తో కలిసి నటించిన సుప్రీమ్ తో హిట్ కొట్టిన రాశి.. యాక్టర్ గా కూడా నాలుగు మెట్లు ఎక్కేసింది.
బెల్లం శ్రీదేవిగా సుప్రీంలో రాశిఖన్నా రోల్ ఆడియన్స్ కి చాలా కాలం గుర్తుండడం ఖాయం. అయితే.. మీడియాలో ఓ వర్గం మాత్రం ఈమెకు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తోంది. బాగా వెయిట్ ఎక్కువ అంటూ.. రాశి బాడీ సైజ్ పై కామెంట్స్ చేస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తం గమనిస్తే.. రాశి ఖన్నా ఆకర్షణీయంగా లేదని చెప్పే ప్రయత్నం అర్ధం చేసుకోవచ్చు. మరి ఇలాంటి కామెంట్స్.. ఆ హీరోయిన్ చెవిలో పడకుండా ఉంటాయా?
'నా బాడీపై వచ్చిన కామెంట్స్ చాలానే విన్నాను. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. కేవలం శరీరాన్నే పట్టించుకోవడం దురదృష్టకరం. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఓ యాక్టర్ గా.. నా పని మాత్రమే మాట్లాడాలి. ప్రస్తుతం చేస్తున్న వర్కవుట్స్ కారణంగా.. గతంలో ఎన్నడూ లేనంత ఫిట్ గా ఫీలవుతున్నా' అనిచెప్పింది సుప్రీమ్ బ్యూటీ.