దుబాయ్ లో 2.0 ఆడియో

Update: 2017-06-20 04:20 GMT
రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 2.0. సూపర్ హిట్ మూవీ రోబోకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దేశంలో అత్యంత కాస్ట్లీ ఫిలింగా ఈ మూవీ ఇప్పటికే గుర్తింపు సంపాదించుకుంది. కేవలం ఒక భాగం కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెడుుతున్నారంటే.. ఈ మూవీపై ఉన్న కాన్ఫిడెన్స్  అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికే 2.0 షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే 8 నెలలకు పైగా సమయం కేటాయించిన దర్శకుడు శంకర్.. అందుకు తగ్గట్లుగానే ఔట్ పుట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కు అత్యంత ప్రాధాన్యత ఉండే ఈ చిత్రంలో.. ఇంటర్నేషనల్ రేంజ్ లో గ్రాఫిక్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. మరోవైపు 2.0 ఆడియో ఫంక్షన్ ను దుబాయ్ లో నిర్వహించాలని తలపెట్టారు. అంతర్జాతీయంగా ఆకర్షించేందుకు గాను.. దుబాయ్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తారట.  2.0 ఆడియో ఫంక్షన్ కోసం కూడా భారీ మొత్తం వెచ్చించనున్నారట.

ఈ ఆడియో లాంఛ్ కు వచ్చే అతిథుల జాబితా తెలిస్తేనే షాక్ తినడం ఖాయం అంటున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న 2.0 మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంపై ఈ నిర్మాణ సంస్థ వెచ్చిస్తున్న మొత్తం చూసి.. ఇండియన్ ఫిలిం మేకర్స్ అంతా షాక్ కు గురవుతున్నారు. 2018 రిపబ్లిక్ డే నాటికి రోబో సీక్వెల్ 2.0ను రిలీజ్ చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News