నా సినిమాల ఫేట్‌ ఎప్పుడూ ఇంతే

Update: 2015-12-14 05:08 GMT
రవితేజ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో బెంగాల్ టైగ‌ర్ చిత్రాన్ని నిర్మించారు రాధామోహ‌న్‌. ఇటీవ‌లే రిలీజైన ఈ చిత్రం చ‌క్క‌ని మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా బి,సి కేంద్రాల్లో వ‌సూళ్లు ఫ‌ర్వాలేద‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత రాధామోహ‌న్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్స్ చెప్పుకొచ్చారు.

''బెంగాల్ టైగ‌ర్ ర‌వితేజ కెరీర్‌ లోనే టాప్ గ్రాస‌ర్‌ గా నిలిచింది (ఇంకా ఫుల్‌ రన్‌ పూర్తవ్వకముందే?).. చ‌క్క‌ని మాస్ హిట్‌ గా నిలిచింది. సంప‌త్ నందికి హ్యాట్రిక్ విజ‌యం ద‌క్కింది. అయితే ఈ సినిమాలో క‌థేమీ కొత్త‌గా ఉండదు. కొత్త క‌థ‌ల్ని తేవ‌డం చాలా క‌ష్టం. ఉన్న క‌థ‌నే కొత్త‌గా ఎలా ట్రీట్ చేశామ‌న్న‌దే చాలా కీల‌కం. మా సినిమాలో స్క్రీన్‌ ప్లే కొత్త‌గా ఉంది. అందుకే జ‌నాలు ఆద‌రించారు..'' అని చెప్పారు. బెంగాల్ టైగ‌ర్ బిజినెస్ ప‌రంగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంది. వాస్త‌వానికి ఈ సినిమాని కిక్ -2 రిలీజ్‌ కి ముందే మా సినిమాకి బిజినెస్ పూర్త‌య్యి ఉంటే బావుండేది. రిలీజ్ త‌ర్వాత ఆ సినిమా తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చ‌డంతో బెంగాల్ టైగ‌ర్ బిజినెస్ ప‌డిపోయింది. పంపిణీదారులు త‌క్కువ రేటు ఇచ్చి కొనుక్కున్నారు.. అని చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి అక్టోబ‌ర్‌ లో మా సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ ఇంత‌కాలం ఆపాల్సొచ్చింది. ఇలా ఆప‌డం వ‌ల్ల కొంత క‌లిసొచ్చింది అంటున్నారు రాధామోహన్‌. ''అప్ప‌ట్లో రిలీజ్ చేసి ఉంటే నెల్లూరు, చెన్న‌య్‌ లో వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయేవాళ్లం. అదీ మా మంచికే అయ్యింద‌ని అనుకుంటున్నా. నేను నిర్మించే సినిమాల విష‌యంలో ప్ర‌తిసారీ ఇలానే జ‌రుగుతోంది. నేను చేసే సినిమా ముందు ఆ హీరో సినిమా ఫెయిల‌వుతూ ఉంటుంది. ఆ ప్ర‌భావం నా సినిమాపై ప‌డుతుంది. ఇప్పుడు నేను హిట్టిచ్చాను కాబ‌ట్టి ఆ త‌ర్వాత తీసే నిర్మాత‌ల‌కు క‌లిసొస్తుంది'' అంటూ చిట్ చాట్ ముగించారు రాధామోహ‌న్‌.

Tags:    

Similar News