ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. దాదాపుగా మూడు సంవత్సరాల పాటు దర్శకుడు రాధాకృష్ణ ఆ సినిమాను రూపొందించాడు. ఓ టైటానిక్ రేంజ్ లో సినిమా ఉంటుంది అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్ సమయంలో ప్రచారం చేశారు. కానీ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.
రాధేశ్యామ్ డిజాస్టర్ అవ్వడంతో దర్శకుడు రాధాకృష్ణ పరిస్థితి ఏంటో అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సమయంలో ఆయన సినిమా అప్డేట్ అందరిని ఆశ్చర్యపర్చుతోంది. రాధాకృష్ణ తన తదుపరి సినిమాను తమిళ సూపర్ స్టార్ ధనుష్ తో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ధనుష్ ద్వి భాషా చిత్రాలు అది కూడా తెలుగు మరియు తమిళం లో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అందుకే ఇప్పటికే సార్ సినిమా ను చేస్తున్నాడు.. ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ధనుష్ కమిట్ అయ్యాడు. ఇవే కాకుండా మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ధనుష్ చేస్తాడట.
అందులో భాగంగానే రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తన వద్ద ఉన్న కథను ధనుష్ కు చెప్పిన రాధాకృష్ణ ఓకే చెప్పించుకున్నాడట. కానీ ప్రస్తుతానికి డేట్లు లేకపోవడంతో హోల్డ్ లో ఉంచాడట.
అతి త్వరలోనే ధనుష్ నుండి స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ రావడం ఖాయం అనే నమ్మకంతో రాధాకృష్ణ వెయిట్ చేస్తున్నాడట. రాధా కృష్ణ రాధేశ్యామ్ తో నిరాశ పర్చినా కూడా ఒక మంచి టెక్నీషియన్ అని మాత్రం పేరు దక్కించుకున్నాడు. కనుక కచ్చితంగా ఈసారి ఆయన దర్శకుడిగా సక్సెస్ అయ్యి ధనుష్ కి సక్సెస్ ఇస్తాడేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.