రాధారవి, విశాల్ మధ్యలో కమల్!

Update: 2015-07-21 04:58 GMT
ప్రస్తుతం తమిళనాడులోని నడిగర్ సంఘం వ్యవహారంలో శరత కుమార్ - విశాల్ వర్గాల మధ్య పోటీకాస్తా... తీవ్రరూపం దాలుస్తుంది! ఈ క్రమంలో వారిమధ్య మాటల తూటాలు దూసుకుపోతున్నాయి, ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి! ఈ ఎన్నికలకు సంబందించి నటుడు విశాల్ వర్గం ప్రచారంలో ముందుకు దూకుపోతుందనే చెప్పాలి. శరత్ కుమార్ వర్గం కూడా ఏమాత్రం తగ్గడం లేదు! ఈ సమయంలో వీరిమధ్య కమల్ హాసన్ ప్రస్థావన హాట్ టాపిక్ గా మారింది!

సేలం తిరుచ్చి జిల్లాలో రంగస్థల నటులతో చర్చలు జరపడానికి ఏర్పాటుచేసిన సమావేశంలో విశాల్ నిప్పులు చెరిగారు. ప్రస్తుత సంఘం నిర్వాహకులపైనా... నడిగర్ సంఘం కార్యదర్శి రాధారవి పైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు! ప్రస్తుత సంఘం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో వారిని ఎదుర్కోవడానికే కానీ... పదవులకోసం తాను పోటీపడటం లేదని అంటున్నాడు! కమల్ హాసన్ ను రాధారవి తప్పుగా మాట్లాడారని, వాటికి సంబందించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని విశాల్ తెలిపాడు! సీనియర్ నటులపైనా, కమల్ లాటి మహానటులపైనా వరైకున్న గౌరవం ఇదని విశాల్ చెప్పే ప్రయత్నం చేశారు!

ఇకపై ఈ సంఘం కొంతమంది బడా వ్యక్తులది కాదని, సామాన్య నటులందరిదీ అని, ఆత్మ ప్రభోదానుసారం అందరూ ఓటువేయాలని పిలుపునిచ్చారు! విశాల్ కు బాసటగా నాజర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు!
Tags:    

Similar News