భాయ్ స్టామినాకి విదేశాల్లో కోవిడ్ త‌ల‌వొంచిందా?

Update: 2021-05-14 05:30 GMT
సల్మాన్ ఖాన్ విదేశాలలో థియేటర్లలో `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్`ను విడుదల చేయడం ద్వారా అభిమానులకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నాడు. భారతదేశంలో ఈ సినిమా ఓటీటీలు స‌హా థియేట‌ర్ల‌లోనూ రిలీజ్ చేశారు. ముందస్తు అంచనాలు ఈ చిత్రానికి మంచి స్పందనను అందిస్తున్నాయి. బాక్సాఫీస్ ఇండియా వివ‌రాల‌ ప్రకారం.. ఆస్ట్రేలియా నుండి విదేశీ గణాంకాలు ప‌రిశీలిస్తే ఈ చిత్రం 60-70 కె డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది.

సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాల ముందస్తు అంచనాలు కనుక ఈ గణాంకాలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. సల్మాన్ చివరి ఈద్ విడుదల అయిన భారత్ ప్రారంభ రోజున సుమారు 110 కె ప్లస్ సంపాదించింది.‘రాధే’ ఇంకా ఆ మార్కును చేరుకోలేదు. కొనసాగుతున్న మహమ్మారి పరిస్థితి వల్ల కలెక్ష‌న్లు నెమ్మ‌దించాయి.

2019లో సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ చిత్రం 4 మిలియన్ల డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. అదే సంవత్సరంలో ‘భారత్’ ఈద్ సందర్భంగా 6.25 మిలియన్ డాల‌ర్ల‌తో ప్రారంభమైంది. కోవిడ్ లేని స‌మ‌యంలో ఆ రెండు సినిమాలు ఈ గణాంకాలను గల్ఫ్ నుండి అందుకున్నాయి. మరోవైపు ‘రాధే’ భారతదేశంలో అభిమానుల నుండి భారీ స్పందనను అందుకుంది. భారీ రద్దీ కారణంగా స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ల సర్వ‌ర్ లు క్రాష్ అయ్యాయి.

ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ లో దిశా పటాని- రణదీప్ హుడా- జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఈద్ సందర్భంగా 13 మే 2021న ప్రధాన విదేశీ మార్కెట్లలో థియేటర్ల‌లో విడుదలైంది. 40 కి పైగా దేశాలలో ఈ సినిమాని రిలీజ్ చేశారు.
Tags:    

Similar News