12ని.లు ట్రిమ్! రాధేశ్యామ్ మ‌రింత గ్రిప్పింగ్ గా!!

Update: 2022-03-09 03:41 GMT
రిలీజ్ ముంగిట రాధేశ్యామ్ అంత‌కంత‌కు అంచ‌నాలు పెంచేస్తోంది. `రాధేశ్యామ్` మేకర్స్ స్వచ్ఛందంగా సినిమాను 12 నిమిషాలు కుదించారని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా నిడివి 138 నిమిషాలు అని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి-ది బిగినింగ్ (2015)లో తన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. బాహుబలి 2 - ది కన్‌క్లూజన్ (2017)తో అతను మరింత ఎత్తుకు ఎదిగి పాన్-ఇండియా సూపర్ స్టార్ గా మారాడు. ఇది అతని తదుపరి చిత్రం సాహో (2019) భారీ ఓపెనింగ్ లో ప్రతిబింబించింది.

ఫలితంగా అతని తదుపరి చిత్రం `రాధే శ్యామ్‌`పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ బహుభాషా చిత్రం విజువ‌ల్ గ్రాండియారిటీ ఇప్ప‌టికే అంచనాల్ని మ‌రింత‌గా పెంచేసింది. స్కేల్ ప‌రంగా ఇది పెద్ద స్క్రీన్ కోసం ఉద్దేశించిన చిత్రం అని ఇప్ప‌టికే స్పష్టం చేసింది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ఇటీవల 12 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు గుస‌గుస వినిపిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 22 డిసెంబర్ 2021న చిత్రానికి U/A సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఆ సమయంలో సినిమా నిడివి 150 నిమిషాలు. అంటే 2 గంటల 30 నిమిషాలు.

కానీ ఇప్పుడు ట్రిమ్ అయ్యింది. గత వారం రాధే శ్యామ్ మేకర్స్ స్వచ్ఛందంగా అనేక సన్నివేశాలను కత్తిరించాలని నిర్ణయించుకున్న‌ట్టు లీకులు అందాయి. మ‌రింత బెట‌ర్ వెర్ష‌న్ కోసం ఈ చిత్రానికి కొన్ని సన్నివేశాలను కూడా జోడించారని తెలిసింది. సిబిఎఫ్ సికి సమర్పించిన స్వచ్ఛంద సవరణ జాబితా ప్రకారం మొత్తం 56 సవరణలు జరిగాయనేది టాక్. వీటిలో దాదాపు 49 మేకర్స్ చేసిన కట్స్. కొన్ని సన్నివేశాలు కేవలం 2 లేదా 5 లేదా 11 సెకన్లు మాత్రమే కత్తిరించారు. రెండు సీక్వెన్స్ ల నుంచి 2 నిమిషాలు.. 5 నిమిషాలు కూడా కత్తిరించార‌ట‌.

కాగా 7 చోట్ల చేర్పులు జరిగాయి. 8 లేదా 10 సెకన్ల నిడివి ఉన్న కొన్ని షాట్ లతో పాటు 5.30 నిమిషాలు... 2.55 నిమిషాలు మరియు 2.16 సెకన్ల నిడివిగల సన్నివేశాలు సినిమాలో అల‌రిస్తాయ‌ని తెలుస్తోంది.

ఎడిట్ రూమ్ లో ఇంత‌టి భారీ క‌స‌ర‌త్తు ద్వారా మూవీపై గ్రిప్ అమాంతం పెంచార‌ని టాక్ వినిపిస్తోంది. రాధే శ్యామ్ ట్రిమ్మింగ్ లో 23 నిమిషాల ఫుటేజీని తొలగించారట‌. మొత్తం 11 నిమిషాల సన్నివేశాలను జోడించారు. రాధే శ్యామ్ చివరి వ్యవధి ఇప్పుడు 138 నిమిషాలు. ఇప్పుడు ఈ సినిమా నిడివి 2 గంటల 18 నిమిషాలు. సోర్సెస్ ప్రకారం.. హిందీ వెర్షన్‌లో కూడా ఇలాంటి మార్పులు చేసార‌ని తెలిసింది.

ఈ చిత్రానికి జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రాధే శ్యామ్ క‌థాంశం ఆస‌క్తిని రేకెత్తించేవిధంగా రూపొందించార‌ట‌. ఒక రహస్యమైన హస్తసాముద్రికుడి కథను తెర‌పై ఆయ‌న ఆవిష్క‌రించారు. ఇది 1970 కాలంలో సాగుతుంది. రాధే శ్యామ్ సంక్షిప్త వెర్షన్ మల్టీప్లెక్స్ లు ఇప్పుడు ఎక్కువ షోలను పొందుపరచగలవు కాబట్టి చిత్రానికి ప్రయోజనం చేకూరుస్తుందని ట్రేడ్ .. ఎగ్జిబిషన్ రంగం నమ్ముతోంది.

రాధేశ్యామ్ కి అత్యంత భారీ ఓపెనింగులు సాధ్య‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏపీలో టికెట్ రేట్ల‌ను పెంచ‌డం ప్ర‌భాస్ రాధేశ్యామ్ కి ఎంతో క‌లిసి రానుంది. ఈ చిత్రం తెలుగు-త‌మిళం- హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది.

Tags:    

Similar News