పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` చివరికి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విస్తరించడం.. నైట్ కర్ఫ్యూలు.. థియేటర్లు సిట్టింగ్ సామార్థ్యం తగ్గించడం.. ఏపీలో టిక్కెట్ రేట్ల సమస్యల్నీ బేరీజు వేసుకుని రిస్క్ ఎందుకులే? అని రాజమౌళి రిలీజ్ వాయిదా వేసారు. మరి మరో పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` మాత్రం వెనక్కి తగ్గలేదు. జనవరి 14న రిలీజ్ వచ్చేస్తున్నామంటూ ప్రకటనలు వస్తున్నాయి. మరి `ఆర్.ఆర్.ఆర్` ఎదుర్కునే ఇబ్బందులు రాధేశ్యామ్ కి ఉండవా? అంటే ఉంటాయి. కానీ `రాధేశ్యామ్` రిలీజ్ వాయిదా పడాలంటే మహరాష్ర్ట..కర్ణాటక రాష్ట్రాలు కీలకం అని తెలుస్తోంది.
రెండు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పరిస్థితి మరీ అదుపుతప్పితే లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో రన్నింగ్ లో ఉన్నాయి. కర్ణాటక మార్కెట్ కి `రాధేశ్యామ్` కి కీలకమైంది. సదరన్ సర్క్యూట్ లో గణనీయమైన ఆదాయన్ని కల్గిన రాష్ట్రమది. మహరాష్ట్ర పరిస్థితి అంతే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు సంఖ్య పెరిగితే లాక్ తప్పదు. అదే జరిగితే `రాధేశ్యామ్` వాయిదా పడుతుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రెండు వారాల వ్యవధిలోనే ఏం జరుగుతుంది? అన్న దానిపై ఓ అంచనాకి రానుంది.
`రాధేశ్యామ్` రిలీజ్ కి అంతే సమయం ఉంది. కాబట్టి అప్పటి పరిస్థితుల్ని బ్టటి మేకర్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకూ `రాధేశ్యామ్` ని రిలీజ్ గానే పరిగణించాలి. `ఆర్ ఆర్ ఆర్` వాయిదా కూడా `రాధేశ్యామ్` కి కలిసొచ్చే అంశం. అందుకే నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. మరి చివరిగా ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.