పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్.. ప్రేరణ గా పూజా కనిపించనున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున ఈ చిత్రానికి సంబంధించిన ప్యాచ్ వర్క్ షూట్ జరుగుతోంది. అయితే సినిమా మొత్తం కంప్లీట్ అవుతున్నా మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అప్పటి నుంచి మరో అప్డేట్ రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. నిర్మాణ సంస్థ పై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే 'రాధే శ్యామ్' టీమ్ కావాలనే 'లో' ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న 'లాలా ల్యాండ్' మాదిరిగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని టాక్. ఇందులో యాక్షన్ పార్ట్ ఉన్నప్పటికీ అదంతా కథలో భాగం గానే ఉంటుందట. ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఆశించే భారీ యాక్షన్ సన్నివేశాలు - ఎలివేషన్ సీన్స్ ఉండవని అంటున్నారు. అందుకే రోజు రోజుకి ప్రభాస్ మీద పెరిగిపోతున్న అంచనాల్ని తగ్గించడానికే ప్రస్తుతం 'రాధేశ్యామ్' టీమ్ ఇలా వ్యవహరిస్తోందని టాక్ వినిపిస్తోంది.
'రాధే శ్యామ్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ - ప్రమోద్ - ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ విడుదల చేయనున్నారు. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథున్ - మనన్ భరద్వాజ్ కలసి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మిథూన్ రెండు పాటలు.. మనన్ ఒక పాట కంపోజ్ చేసారని సమాచారం. ఈ చిత్రంలో జగపతిబాబు - సత్యరాజ్ - భాగ్యశ్రీ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - శాషా ఛత్రి - ప్రియదర్శి - రిద్దికుమార్ - సత్యాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 'రాధే శ్యామ్' విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.