వాళ్ల చెంప మీద కొట్టి నోర్లు మూయించిన లేడీ డాకు!
దబిడి దిబిడి సాంగ్ ట్రోల్స్ పై హీరోయిన్ ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్న వారి చెంప మీద కొట్టినట్లు సమాధానం ఇచ్చి వారి నోరు మూయించింది.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డాకు మహారాజ్' సినిమాకు హిట్ టాక్ దక్కింది. మొదటి మూడు రోజుల్లోనే దాదాపుగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన డాకు మహారాజ్ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించారు. బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, కీలక పాత్రల్లో ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ లు నటించారు. శ్రద్దా శ్రీనాథ్ కలెక్టర్ పాత్రలో నటించి మెప్పించింది. బాలకృష్ణకు చెల్లిగా శ్రద్దా కనిపించింది. ఇక ఊర్వశి రౌతేలా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఊర్వశి మొదట ఐటెం సాంగ్ వరకే అని అంతా అనుకున్నారు. కానీ సినిమాలో ఆమె పాత్ర అత్యంత కీలకంగా ఉంది. ఒక యాక్షన్ సీన్‌లోనూ ఆకట్టుకుంది.
బాలకృష్ణతో ఊర్వశి రౌతేలా చేసిన దబిడి దిబిడి సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. అయితే అందులోని కొన్ని డాన్స్ మూమెంట్స్‌పై విమర్శలు ఎదురు అవుతున్నాయి. ముఖ్యంగా ఊర్వశి వెనకాల నుంచి బాలకృష్ణ కొడుతున్నట్లుగా ఉన్న స్టెప్ విషయంలో కొందరు ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన డాన్స్ అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌కి చెందిన వారు కూడా బాలకృష్ణ, ఊర్వశిల డాన్స్‌పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేసిన వారు ఉన్నారు. కొందరు యాంటీ బాలకృష్ణ ఫ్యాన్స్ దీన్ని రచ్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
ఈ స్టెప్స్ విషయంలో ఊర్వశి రౌతేలా అసంతృప్తిగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు ఆమె కు ఇష్టం లేకుండా ఈ మూమెంట్స్ చేయించారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా రకాలుగా ఈ విషయం గురించి ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దబిడి దిబిడి సాంగ్ ట్రోల్స్ పై హీరోయిన్ ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్న వారి చెంప మీద కొట్టినట్లు సమాధానం ఇచ్చి వారి నోరు మూయించింది. బాలకృష్ణను విమర్శిస్తున్న వారికి గట్టి సమాధానం చెప్పడం ద్వారా ఊర్వశి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... ఏ సినిమా చేసినా దాని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. విజయం సాధించిన సినిమా గురించి ఇంకాస్త ఎక్కువగానే చర్చలు జరుగుతూ ఉంటాయి. విమర్శలను నేను అర్థం చేసుకోగలను. ఎంత వరకు తీసుకోవాలో అంత వరకు మాత్రమే విమర్శలను తీసుకుంటాను. బాలకృష్ణ గారు నటనలో లెజెండ్. ఆయనతో సినిమాను చేయాలి అనేది నా కల. ఆ కల ఈ సినిమాతో నెరవేరింది. బాలకృష్ణ గారితో డాన్స్ చేయడం అనేది కేవలం నటన కాదు, నాకు ఆయనపై ఉన్న గౌరవం, ఆయనతో వర్క్ చేయాలని ఉన్న ఇష్టంతో చేసింది. దాన్ని విమర్శించిన వాళ్ల గురించి నేను పట్టించుకోను అంది.