ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్- టి సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా కేటగిరీలో ఈ చిత్రం భారీగా థియేటర్లలో రిలీజ్ కానుంది. 1975 బ్యాక్ డ్రాప్ లో యూరప్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ చిత్రమిది. ఇందులో అందమైన లవ్ స్టోరీ కట్టిపడేస్తుందని యూనిట్ చెబుతోంది. ఓ వైపు భారీ యాక్షన్ సీక్వెన్స్ ని పతాక స్థాయిలో చూపిస్తూనే ప్రేమకథను హైలైట్ చేసారని సమాచారం. 1975 కాలానికి తీసుకెళ్లే అద్భుతమైన సెట్స్ ని కూడా అంతే హైలైట్ చేస్తున్నా రు. యూరప్ లో అందమైన ఎగ్జోటిక్ లోకేషన్స్ నడుమ మెజారిటీ చిత్రీకరణ జరిపారు.
యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేసారు. రాజీ లేని నిర్మాణంతో యూవీ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా పెట్టుబడుల్ని సమకూర్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమా క్లైమాక్స్ స్పెషల్ గా ఉండబోతుందని సమాచారం. కేవలం క్లైమాక్స్ కోసమే 50 కోట్లు వెచ్చిస్తున్నారుట. దాదాపు 15 నిమిషాల పాటు క్లైమాక్స్ ఉంటుందని.. యాక్షన్ సన్నివేశాలు అసాధారణంగా ఉంటాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అలాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి. `మగధీర` రేంజ్ లో ప్రేమకథలో ఎమోషన్ వర్కవుటైందని ప్రీవిజువల్స్ వీక్షించిన వారు లీకులిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ కి జోడీగా పూజాహెగ్డే నాయిక. ఇంకా సీనియర్ నటుడు కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించారు. పరమహంస పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. అలాగే సచిన్ కేద్కర్..భాగ్యశ్రీ..మురళీ శర్మ..ప్రియ దర్శి లాంటి ప్రతిభావంతులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాత్రలన్ని వేటికవి ప్రత్యేకంగా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు.
వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాల్ని ప్రారంభించాడు. రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో రిలీజవుతుండగా.. సలార్ -ఆదిపురుష్ 3డి చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. పనిలో పనిగా నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రారంభించి షెడ్యూళ్లకు సహకరిస్తున్నాడు.ఇంతలోనే ప్రభాస్ నటించే 25వ సినిమా గురించి ఆసక్తికర విషయం రివీలైంది. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తారు. ఇప్పటికే `వ్రిందావన` అనే టైటిల్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన దిల్ రాజు పాన్ ఇండియా కేటగిరీలో కథాంశాన్ని సిద్ధం చేయించాడని తెలిసింది. ప్రభాస్ తో దిల్ రాజు 2023 చివరలో ఈ సినిమాను ప్రారంభిస్తారట. అయితే ఊపిరాడని ఈ షెడ్యూల్స్ ఉన్నా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కి మరో సినిమా చేస్తానని కమిటయ్యాడు. అది బాహుబలి ని మించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని అర్థమవుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాకి కమిటయ్యాడని కథనాలొస్తున్నాయి. సందీప్ .. దిల్ రాజు ప్రాజెక్టులపై అధికారికంగా మారింత క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం డార్లింగ్ క్యూలో ఉన్న సినిమాలన్నీ రిలీజైతే దేశంలోనే అత్యంత క్రేజీ స్టార్ గా ప్రభాస్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టేనని అంచనా వేస్తున్నారు. ఓ వైపు ఖాన్ లు 60 ఏజ్ కి చేరువలో ఉన్నారు. దీంతో వాళ్లకు ధీటైన ఛరిష్మా కలిగిన స్టార్లలో ప్రభాస్ పేరు కూడా రేస్ లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు.