పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ ఆకాశన్నంటుతోంది. ఫ్యాన్స్ తోపాటు సగటు ప్రేక్షకులు కూడా రెబల్ స్టార్ అప్డేట్స్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటగా రాబోతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. బాహుబలి, సాహో వంటి యాక్షన్లు చూసిన తర్వాత.. ప్రభాస్ నుంచి రాబోతున్న లవ్ స్టోరీ ఎలా ఉంటుందా? అనే క్యూరియాసిటీ సర్వత్రా నెలకొంది.
అయితే.. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాను కరోనా రెండు సార్లు అడ్డుకుంది. దీంతో.. ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ ఇన్ టైమ్ లో పూర్తికాలేదు. 80వ దశకం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాలా వరకు సెట్స్ లో షూట్ చేశారు. మిగిలిన పార్టు కోసం సీజీ వర్క్ ను ఆశ్రయించారు. ఈ వర్క్ ను విదేశీ కంపెనీలకు అప్పగించడం.. అక్కడ కరోనా ఇబ్బందులు రావడం.. ఇలాంటి చాలా కారణాలతో పని ఆలస్యమైంది.
ఇక, ఈ సమయంలోనే రీ-షూట్ కు సైతం వెళ్లారని టాక్. వాస్తవానికి ఓ పాట యాడ్ చేయాల్సి ఉంది. కొన్ని సీన్లు రీషూట్ చేస్తే బాగుంటుందని కూడా ప్రభాస్ అన్నాడట. అయితే.. ఈ కరోనా టైమ్ లో అవసరమా అని అనుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇంకా ఓ వారం షూట్ మిగిలి ఉందని తెలుస్తోంది. అంటూ షూట్ కు వెళ్లిపోయారన్నమాట. ఇది మినహా మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ బ్యాలెన్స్ కూడా షూట్ చేసి, ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తే.. ప్రభాస్ ప్రేమ కావ్యం సిద్ధమైపోతుంది.
అయితే.. సినిమా రిలీజ్ ఎప్పుడన్నేది చూడాల్సి ఉంది. జూన్ ఎండింగ్ లో రాబోతున్నట్టు అప్పుడెప్పుడో ప్రకటించారు. కానీ.. పరిస్థితులు మొత్తం మారిపోయాయి. కరోనా ప్రభంజనం జూన్ లో కూడా కొనసాగ్గేట్టు కనిపిస్తోంది. దీంతో.. మేకర్స్ కొత్త డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారన్నది కూడా సస్పెన్సే. ఇక, సినిమా ప్రమోషన్లు ఎప్పుడు మొదలు పెడతారనేది కూడా జూన్ లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.