ప్రభాస్ పేరు ఇప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సంప్రదాయాన్ని తెర మీదకు తెచ్చింది ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలితో వచ్చిన క్రేజ్‌ను దృష్టి లో పెట్టుకుని ఆయన అన్ని సినిమాలు కూడా ఐదు భాషల్లో ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆయన వరుసగా పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా రాధే శ్యామ్.
ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ చేస్తున్నవిషయం అందరికీ విదితమే. కాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాధా కృష్ణ భారీ హంగులతో తెరకెక్కిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీని ఒక వింటేజ్ లవ్ స్టోరీగా తీర్చి దిద్దుతున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులే అవుతున్నా ఆ మధ్య అప్ డేట్ లేక పోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే రాధేశ్యామ్ మొదలై ఇప్పటికే ఎన్నో రోజులు అవుతున్నా కూడా కనీసం ఒక్క పాటను కూడా విడుదల చేయలేదు. వేరే హీరోల సినిమాలు అప్ డేట్ల మీద అప్ డేట్లతో దూసుకు పోతున్నారు. కానీ ప్రభాస్ సినిమాల విషయంలో అది జరగట్లేదు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసిన ఈ చిత్రం ప్రమోషన్స్ వర్క్స్ మొదలు పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ నెల నుంచి మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కోసం చాలా రిచ్‌గా ప్లానింగ్ చేస్తున్నారంట. వచ్చే నెల నుండి రిలీజ్ డేట్ వరకు కూడా అదిరే ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తాజా టాక్. ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ అయితే అభిమానులకు పండగే. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రను కృష్ణంరాజు పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ లుక్ చాలా స్టైలిష్ గా ఉందని ఇప్పటికే టాక్ వచ్చింది. సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.