ఇటీవలే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. తొలి షోతోనే సినిమా సంగతి తేలిపోయింది. సినిమా లో విజువల్ ట్రీట్ ఓ వర్గం ఆడియన్స్ ని మెప్పించినా మెజార్టీ వర్గంలో మాత్రం విఫలమైంది. పిరియాడిక్ లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ కాలేకపోయారు. అజరామర ప్రేమికులు సైతం సీటు కూర్చోవడం కష్టమైందన్న టాక్ వినిపించింది. సినిమా విజువల్ గా హైలైట్ గా నిలిచినా కథా బలం..కథనాలు బలహీనంగా నడవడటం వంటి కారణాలు సినిమాని అమాంతం కిందకి లాగేసాయి.
తెలుగు రాష్ర్టాల్లో ఇలాంటి కథలు సక్సెస్ అవ్వడం అన్నది కాస్త కష్టమైనే పనే. అందుకే హిందీ బెల్డ్ లో ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసారు. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ నడుమ అక్కడ సక్సెస్ అవుతుందని మేకర్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ అక్కడా పనవ్వలేదు. టాక్ ఎలా ఉన్నప్పటికి `సాహో` టైపులో రెండు.మూడు రోజుల పాటు వసూళ్లుబాగానే ఉంటాయని భావించారు. కానీ అక్కడా తొలి షోతోనే తెలిపోయింది. ఇక ప్రభాస్కి కీలకమైన అమెరికా మార్కెట్ లో సినిమా దెబ్బేసింది.
మొదటి రెండు రోజులు భారీ వసూళ్లు దక్కినప్పటికీ మూడవ రోజు నుంచే సినిమా చప్పబడింది. ఒక్కసారిగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పడిపోయాయి. యూఎస్ లో శుక్రవారం 24 కె వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండవ శుక్రవారం 2 మిలియన్ మార్క్ ని కూడా టచ్ చేయలేకపోయింది. దీంతో అంతా షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ప్రభాస్ మార్కెట్ ఇంత వీక్ గా ఉందా? అన్న సందేహం రాకమానదు. ఈ చిత్రం 2 మిలియన్ మార్క్ లోకి రావడానికి ఇంకా 3 కోట్లు కావాలి.
శనివారానికి 2 మిలియిన్ క్లబ్ లో చేరుతుందని అంచనాలున్నాయి. మరి ఆ రిపోర్ట్ బయటకు వస్తే గానీ సంగతేంటి? అన్నది తేలదు. సాధారణంగా రొమాంటిక్- క్లీన్ ఎంటర్ టైనర్ లకు యూఎస్ లో ఆదరణ బాగానే ఉంటుంది. యావరేజ్ గా ఉన్నా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆ జానర్ కథలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగానే మెప్పించిన సందర్భాలు..రిపోర్టులు ఉన్నాయి.
కానీ `రాధేశ్యామ్` విషయంలో అంతా తారుమారైంది. లీడ్ పెయిర్ లో కంటెంట్ కథనం..సరైన కెమిస్ర్టి కుదరకపోవడం వంటివి అక్కడ ప్రధాన వైఫల్యంగా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇండియాలో కూడా సినిమా పెద్దగా వసూళ్లు తీసుకురాలేదు. దీంతో డిస్ర్టిబ్యూటర్లకి నష్టాలు తప్పినట్లు లేదు. సినిమాని భారీ ధరకు నిర్మాణ సంస్థ అమ్మేసి సేఫ్ జోన్ లో ఉన్నా..పంపిణీదారులు..ఎగ్జిబిటర్లు లాక్ అవ్వక తప్పలేదు.