ప్రభాస్ 'రాధేశ్యామ్' ఫీవర్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇండియన్ సినీ అభిమానులు ఎక్కడ ఉంటే అక్కడ రాధేశ్యామ్ గురించిన చర్చ జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. వంద కాదు వెయ్యి కాదు ఏకంగా పది వేల స్క్రీన్ ల్లో రాధేశ్యామ్ సినిమా స్క్రీనింగ్ అవ్వబోతుంది. సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ బాహుబలి రేంజ్ లో ఉంటాయి.. లేదంటే అంతకు మించి ఉంటాయి అనేది టాక్.
రాధేశ్యామ్ సినిమా యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్లను రాబట్టినట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. విడుదల సమయంకు ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు ఈ సినిమా ను యూకే లో ఉన్న ఇండియన్స్ కూడా భారీ ఎత్తున చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్ లో భారీ గా అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి. అక్కడ దాదాపుగా 1.5 పౌండ్ల వసూళ్లు నమోదు అయ్యాయి అంటున్నారు. అంటే కోటికి పైగానే ఇప్పటికే అక్కడ వసూళ్లు నమోదు అయ్యాయి.
యూఎస్ లో ఇండియన్ సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు భారీ వసూళ్లు నమోదు అవ్వడం చూశాం. కాని యూకేలో మాత్రం ఇలాంటి వసూళ్లు ఇప్పటి వరకు చూడలేదు అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
యూకే లో లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా నాలుగు నుండి అయిదు కోట్ల వరకు వసూళ్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా విడుదల కాబోతున్న రాధేశ్యామ్ సినిమాకు యూకే వసూళ్లు కీలకం అవుతాయని అంటున్నారు.
ఈ మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమాను ఇండియా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా మొదటి వారం రోజుల్లోనే చూసే అవకాశం ఉందంటున్నారు. తద్వారా మొదటి వారం రోజుల్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ వసూళ్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు మరియు బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ సాహో సినిమా తెలుగు రాష్ట్రాల్లో కాస్త తక్కువ వసూళ్లు చేసింది. దాంతో ఇక్కడ కాస్త బిజినెస్ డల్ అయ్యింది. రాధేశ్యామ్ ఆ లోటును భర్తీ చేస్తుంది. ప్రభాస్ రాబోయే సినిమాలు భారీ క్రేజ్ ను కలిగి ఉండేలా రాధేశ్యామ్ సినిమా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ కు జోడీగా ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో కృష్ణం రాజు నటించాడు. సౌత్ మరియు నార్త్ భాషలకు వేరు వేరుగా సన్నివేశాలను చిత్రీకరించారట. స్క్రీన్ ప్లే కూడా కాస్త విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు.