దేశ విదేశాల్లో వీరలెవల్ ఫాలోయింగ్ ఉన్న పాన్ వరల్డ్ (ఇండియా) హీరో ఏదైనా సినిమాలో నటిస్తున్నాడు అంటే మాస్ లో ఆ రేంజులోనే అంచనాలుంటాయి. ముఖ్యంగా ఊపిరాడనివ్వని భారీ యాక్షన్ కంటెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే అలాంటి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ యాక్షన్ అన్నదే లేని సినిమా చేస్తున్నాడా? అంటే సోర్స్ ప్రకారం అవుననే తెలుస్తోంది.
ప్రభాస్ - పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ లో ఫైట్లు ఉండవట. ఇటీవలే ఇటలీకి వెళ్లిన టీమ్ కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తోంది. శరవేగంగా సీన్స్ చిత్రీకరిస్తున్నారట. వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలన్న తపనతో మేకర్స్ పని పూర్తి చేస్తున్నారట. ఇదో అందమైన స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం. ఈ రకమైన కథ ప్రభాస్ ఎప్పుడూ టచ్ చేయనే లేదు. అంతేకాదు... ఈ చిత్రంలో ఎటువంటి యాక్షన్ సన్నివేశాలు లేవని లీకులందాయి. ఈ చిత్రంలో పోరాటాలు లేవు. ప్రభాస్ ఎవరినీ కనీసం చెంపదెబ్బ అయినా కొట్టడు. ఇది ఖచ్చితంగా భిన్నంగా ఎగ్జయిట్ చేసేదిగా ఉంటుందని తాజాగా లీకులందాయి.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. యువి క్రియేషన్స్- గోపి కృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి. ప్రియదర్శి- సాషా - భాగ్యశ్రీ తదితరులు నటిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను అక్టోబర్ 23 న ఆవిష్కరిస్తామని మేకర్స్ ప్రకటించారు.