ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ జనవరిలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందే హైదరాబాద్ లో అభిమానుల నడుమ భారీ ఈవెంట్ కు రంగం సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా దేశవ్యాప్తంగా 40000 మంది అభిమానులు ప్రభాస్ - పూజా హెగ్డేలతో పాటు గ్రాండ్ సెలబ్రేషన్ లో పాల్గొంటారు. ఇలాంటి అరుదైన అపూర్వమైన సంఘటన గురించి మాట్లాడుతూ పూజా హెగ్డే ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకుంది.``రంగస్థలం సెట్ చేసాం. ప్రేమకథ ప్రారంభం కానుంది. #రాధేశ్యామ్ ట్రైలర్ విడుదల అవుతుంది`` అంటూ వెల్లడించింది. తాజాగా మరోసారి అధికారిక కన్ఫర్మేషన్ ని ఇస్తూ చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. దీనిపై నేడు ట్రైలర్ విడుదలవుతోంది అని వెల్లడించింది.
ఈ భారీ ఈవెంట్ కి అన్ని కోవిడ్-19 ప్రోటోకాల్ లను అనుసరించి భారతదేశం నలుమూలల నుండి దాదాపు 40 వేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లు ఉన్న వ్యక్తులు మాత్రమే ఈవెంట్ కి ప్రవేశానికి అనుమతించబడతారు. అలాగే రామోజీ స్టూడియోస్ లో ఓపెన్ గ్రౌండ్ లో భారీ సెట్ ను ఇప్పటికే నిర్మించారు. ఈవెంట్ కి ముందు టెంపరేచర్ తనిఖీలు ఉంటాయి. శానిటైజర్ లు- మాస్క్ లు తప్పనిసరి అని సమాచారం అందించాయి.
ప్రభాస్ చివరిసారిగా 2019లో వచ్చిన సాహో చిత్రంలో కనిపించాడు. మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ప్రభాస్ హాళ్లకు దూరంగా ఉన్నారు. చాలా ఓపిగ్గా డార్లింగ్ అభిమాన తమ ఫేవరెట్ ని థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
టి-సిరీస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి యువి క్రియేషన్స్ - గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా పెట్టుబడులు సమకూర్చాయి. జిల్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు వంటి సీనియర్ ఎడిటింగ్ వర్క్ అందించారు.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ- కృష్ణం రాజు- సచిన్ ఖేడేకర్- ప్రియదర్శి -మురళీ శర్మ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్- వంశీ - ప్రమోద్ తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధే శ్యామ్ 14 జనవరి 2022 న వెండితెరపైకి రానుంది.

A love story that will take you on a memorable ride. #RadheShyamTrailer out today.
Watch live