రాధేశ్యామ్ విడుదల అయ్యి చాలా నెలలు అవుతున్నా కూడా ఇంకా ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ప్రభాస్ సినిమాల గురించి ప్రస్థావన వచ్చిన ప్రతీ సారి కూడా రాధేశ్యామ్ సినిమా దారుణంగా నిరాశ పర్చింది అంటూ అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ దృశ్య కావ్యం అంటూ చెత్త సినిమా తీశారని అభిమానులు ఇంకా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
సందర్భం ఏదైనా కూడా రాధేశ్యామ్ సినిమాను గుర్తుకు తెచ్చుకుని మరీ నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం పరిపాటి అయ్యింది. ఉత్తర భారతంలో రాధేశ్యామ్ భారీ వసూళ్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ అక్కడ కేవలం 18 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. మినిమం గా 50 కోట్ల వసూళ్లు అక్కడ నమోదు అవుతాయని భావిస్తే కనీసం పాతిక కోట్ల వసూళ్లను కూడా దక్కించుకోలేక పోయింది.
రాధేశ్యామ్ తర్వాత వచ్చిన సౌత్ సినిమాలు కొన్ని సునాయాసంగా ఉత్తర భారతంలో వసూళ్ల ను నమోదు చేస్తున్నాయి. చిన్న సినిమా గా విడుదల అయిన కార్తికేయ 2 సినిమా తక్కువ సమయంలోనే ఉత్తర భారతంలో ఏకంగా 15 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఈ వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి అక్కడ కార్తికేయ 2 సినిమా పాతిక కోట్లకు మించి వసూళ్లు నమోదు చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
కార్తికేయ 2 సినిమా యొక్క బాలీవుడ్ ప్రస్థానం ఎలా మొదలయ్యిందో అందరికి తెల్సిందే. మొదటి రోజు కేవలం 50 స్క్రీన్స్ లో మాత్రమే కార్తికేయ 2 విడుదల అయ్యింది. సినిమా వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో భారీ ఎత్తున స్క్రీన్స్ సంఖ్య మరియు షో ల సంఖ్య పెంచుతూ వచ్చారు. వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లో కూడా ఉత్తర భారతంలో తెలుగు రాష్ట్రాలతో సమానంగా వసూళ్లు నమోదు అయ్యాయి.
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు అక్కడ దక్కుతున్న ఆధరణకు కార్తికేయ 2 ప్రత్యక్ష సాక్ష్యం. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన కార్తికేయ 2 సినిమా ఇంత భారీ వసూళ్లు నమోదు చేస్తూ ఉంటే.. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన రాధేశ్యామ్ సినిమా మాత్రం అక్కడ కనీసం 20 కోట్ల రూపాయలను వసూళ్లు చేయలేక పోయింది అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
సినిమా బడ్జెట్ ముఖ్యం కాదు.. సినిమా లో ఉన్న కంటెంట్ ముఖ్యం అని కార్తికేయ 2 సినిమా మరోసారి నిరూపించింది అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా ను ఎంత ప్రమోట్ చేసినా.. ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినా కూడా కంటెంట్ సరిగా లేకుంటే బూడిదలో పోసిన పన్నీరే అని కార్తికేయ మరియు రాధేశ్యామ్ సినిమాలను కంపైర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.