నేను శృంగారం కోసం ఇండస్ట్రీకి రాలేదు: స్టార్ హీరోయిన్

Update: 2020-05-03 00:30 GMT
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన బోల్డ్ సినిమాల సన్నివేశాలు లీక్ కావడం కొత్తేమీ కాదు. గతంలో రాధికా ఆప్టే నటించిన ''ద వెడ్డింగ్ గెస్ట్'' అనే ఇంగ్లీష్ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న వేళ.. ఈ సినిమాలోని ఓ హాట్ రొమాంటిక్ సీన్ లీకై నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సీన్‌లో రాధికా ఆప్టే, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్ నగ్నంగా కన్పించారు. ఈ వ్యవహారంపై రాధికా ఆప్టే తీవ్రస్థాయిలో మండిపడింది. సమాజంలో సైకో మెంటాలిటీ పెరిగిపోయిందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఫైర్ అయ్యింది. అప్పట్లో లీకైన సీన్‌లో తనతో పాటు దేవ్ కూడా నటించాడని.. అతనిని మాత్రం వదిలిపెట్టి.. తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయని, వాటన్నింటినీ వదిలి, కేవలం శృంగార దృశ్యాల గురించి మాత్రమే మాట్లాడితే ఎలా అని అడుగుతోంది.

ఇక బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగానని.. నటులు వేదికపై నగ్నంగా నటించడాన్ని కూడా తిలకించానని పేర్కొంది. తన శరీరాన్ని చూసి తానెందుకు సిగ్గుపడాలని రాధికా ఆప్టే ప్రశ్నించింది. అవసరమైతే ఎలాగైనా నటించేందుకు తాను రెడీనని చెప్పింది. రాధికా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది. `అహల్య`, `బద్లాపూర్` వంటి చిత్రాల్లో రాధిక నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది రాధికను రొమాంటిక్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారట. ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి న్యూడ్‌గా నటించమంటే ఎలా? కేవలం సె* చేయడం కోసమే నేను ఇండస్ట్రీకి రాలేద`ని రాధిక ఘాటుగా తేల్చి చెప్పేసింది. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాధిక తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడింది. డ్రెస్సింగ్ విషయంలో దీపికా పదుకొణే, కంగన రనౌత్ స్టైల్ అంటే ఇష్టమని చెప్పింది. ఏ దుస్తులు ధరించినా ఆత్మవిశ్వాసం ముఖ్యమని చెప్పుకొస్తుంది అమ్మడు.
Tags:    

Similar News