బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే మరోసారి దక్షిణాది సినిమా పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసింది. గతంలో ఒక సౌత్ హీరో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ చెప్పిన రాధిక మరోసారి దక్షిణాది సినిమా పరిశ్రమకు చెందిన దర్శకుడిపై విరుచుకు పడినది. ఒక దర్శకుడు ఆడిషన్స్ కోసం అంటూ నన్ను ఒక హోటల్ కు పిలిపించి నాతో నీచంగా ప్రవర్తించాడు, ఆ దర్శకుడు ఆడిషన్స్ అని - ఇంకా ఏదో హంగామా చేసి చివరకు సినిమాను మొదలే పెట్టలేదు.
ఆ దర్శకుడి పేరు గుర్తు లేదు కాని - నేను ఒక సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి ముంబయి రాగానే ఫోన్ చేశాడు. సౌత్ లో ఒక స్టార్ హీరోతో - ఛారిత్రాత్మక చిత్రం - భారీ బడ్జెట్ చిత్రం మిమ్ములను ఆడిషన్స్ చేయాలి వస్తారా అంటూ అడిగాడు. పెద్ద సినిమా అంటున్నాడు కదా అని వెళ్లాను. నన్ను ఒక చెత్త హోటల్ కు తీసుకు వెళ్లారు. అంత దారుణమైన హోటల్ ను నేను ఎప్పుడు చూడలేదు. అయినా కూడా సరే అనుకుని ఆడిషన్స్ చేయాలనుకున్నారు. ఆడిషన్స్ లో భాగంగా నాతో చెత్త డాన్స్ మూమెంట్స్ వేయించడంతో పాటు - నేను చెత్త మూమెంట్స్ చేస్తున్నప్పుడు ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు ఏం చేశారో కూడా తెలియదు.
కొందరు నా వద్దకు వచ్చి ఒక జాకిట్ ఇచ్చి దాన్ని వేసుకోవాలని సూచించారు. అది కాస్త అసభ్యంగా ఉంది. అది వేసుకోగానే ఫొటోలు తీకున్నారు. పది మందికి పైగా ఉన్న వారు తమను తాము కాస్ట్యూమ్స్ డిజైనర్స్ గా పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత పలు యాక్టివిటీలు చేయించారు. సినిమాకు ఆ యాక్టివిటీలకు ఏం సంబంధం అని అడిగినా కూడా ఏ ఒక్కరు సమాధానం చెప్పలేదు. విక్రమ్ సినిమా అంటూ చెప్పిన దర్శకుడు సినిమాను మొదలే పెట్టలేదు. నేను సౌత్ లో ఎదుర్కొన్న ఈ దారణమైన అనుభవంతో మళ్లీ సౌత్ మొహం చూడవద్దని అనుకున్నాను అంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది.