రక్త చరిత్ర చిత్రంలో డీసెంట్ గా, డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ లో నటించింది రాధికా ఆప్టే. ఆ తర్వాత అనూహ్యంగా లెజెండ్, లయన్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి తెలుగు ప్రేక్షకులకు సర్ ప్రైజ్ నిచ్చింది. ఇటీవలే అహల్య లఘుచిత్రంతో ప్రపంచాన్ని తట్టి నిద్ర లేపింది. లఘుచిత్రాలతోనూ అభిమానుల్ని పెంచుకోవచ్చని నిరూపించింది. లయన్, లెజెండ్ సినిమాల్లో నటనకు రాని గుర్తింపు ఒక్క అహల్యతో తెచ్చుకుందంటే అతిశయోక్తి కాదు.
అయితే ఈ అమ్మడు అహల్యగా చాలా హాట్ గా కనిపించింది. అంతకంటే ముందే అనురాగ్ కశ్యప్ లఘుచిత్రం కోసం పూర్తి నగ్నంగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రెండు సన్నివేశాల్లో విమర్శకులు ఈ అమ్మడిపై బాణాలు ఎక్కుపెట్టారు. మరీ వల్గర్ గా నటిస్తోంది. బరి తెగిస్తోంది అంటూ తీవ్రమైన కామెంట్లు చేశారు. ఇంతకాలం సైలెంటుగా ఉన్నా ఈ భామ వార్ కి తెరతీసిందిప్పుడు.
నాపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. చెయ్యండి. వాటిని బాగానే ఎంజాయ్ చేస్తున్నా. పాజిటివ్ విమర్శలు చేస్తే బలాన్ని పెంచుతాయి. నెగెటివ్ విమర్శలు కొంత ఇబ్బంది పెట్టినా అవి కూడా ఎదుగుదలకు ఉపకరిస్తాయి. ఇలాంటి మరిన్ని ఘాటైన విమర్శలు కావాలి... అంటూ తనదైన శైలిలో స్పందించింది. కమర్షియల్ సినిమాల్లోనే ఎందుకు నటిస్తావ్? అని అడుగుతారు. కోట్లాది రూపాయల్ని పందేరం పెట్టేప్పుడు అవి తిరిగి రావాలంటే ఏం చేయాలి? అని ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. రాధిక వాస్తవంలో బతుకుతోంది కదూ?