ఇప్పుడున్న ట్రెండ్ లో హీరొయిన్లకు పేరు సినిమాల్లో రావడం ఏమో కాని అంతకు మించి పాపులారిటీ సోషల్ మీడియాలో దక్కుతోంది. తుమ్మినా, దగ్గినా, ఎక్కడికైనా వెళ్ళినా ప్రతిది అభిమానులతో షేర్ చేసుకోవడమనేది ఇప్పుడొక అలవాటుగా మారింది. అందులో రాధికా ఆప్టే కూడా ఉంది. రజనికాంత్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఆశించిన పేరు ప్రఖ్యాతులు రాకపోవడంతో బాలీవుడ్ లో బోల్డ్ సినిమాల్లో నటిస్తున్న రాధికా ఆప్టే సంచలనాలకు మారు పేరు. ఆ మధ్య అజయ్ దేవగన్ నిర్మించిన పర్చేద్ లో నగ్నంగా నటించి సెన్సేషన్ రేపిన ఈ భామ మొన్నొచ్చిన అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ సినిమాలో అతని భార్యగా నిండైన చీరకట్టుతో చక్కగా కనిపించి ఔరా అనిపించింది. తన ప్రత్యేకతే అది.
తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో గోవా బీచ్ లో ఉండగా తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియా ఎకౌంటు లో షేర్ చేసిన రాధికా ఆప్టే దాని పుణ్యమా అని ఫాన్స్-యాంటీ ఫాన్స్ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. పైన చూసారుగా అందులో ఏముందో. రాధికా ఆప్టే టూ పీస్ బికినీలో ఉండగా బాయ్ ఫ్రెండ్ జస్ట్ ఒక త్రీ బై ఫర్ షార్ట్ తో తన పక్కనే ముసిముసినవ్వులు రువ్వుతూ కెమెరాకు స్టిల్ ఇచ్చాడు. అంతే. కొందరు రాధికా ఆప్టే బికినీ అందాన్ని ఆస్వాదిస్తూ పొగడగా మరొకరు ఇలా బట్టలు లేకుండా జంటగా ఫోటోలు దిగి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అని చిన్న సైజు క్లాస్ పీకాడు. ఇది కాస్తా మాట మాట పెరిగి కామెంట్స్ లో ఒకళ్ళనొకళ్ళు తీవ్ర పదజాలంతో దుమ్మెత్తి పోసుకున్నారు. నిప్పు రాజేసి వేడుక చూడటం అంటే ఇదే కాబోలు.
అవకాశాలు తగ్గినట్టు కనిపిస్తున్నా రాధికా ఆప్టే కెరీర్ ప్రస్తుతం మహా దివ్యంగా ఉంది. బజార్, భవేష్ జోషి, బామ్బరియా అనే హింది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా గవుల్ - ది ఆశ్రం అనే ఇంగ్లీష్ సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇవి కాకుండా ఉలా అనే తమిళ సినిమా కూడా తన ఖాతలోనే ఉంది. సో రెండు వైపులా బిజీగా ఉన్న రాధికా ఆప్టే ఏదైనా మొహం మీద చెప్పడం మంచి పేరుంది.