బాల‌య్య భామ‌.. గుస్సా చూశారా?

Update: 2018-10-08 16:35 GMT
మీడియా నుంచి త‌ప్పించుకుని పారిపోతోంది. వెంట ప‌డుతుంటే రుస‌రుస‌లాడేస్తోంది. ఛీ వెద‌వ‌లు! అన్న‌ట్టే చూస్తోంది. ఇంకా వెంట‌ప‌డితే చంపేస్తాన‌న్న‌ట్టే ఉంది వాల‌కం. అస‌లింత‌కీ ఎందుకింత ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. అస‌లేమైంది? ఎందుకింత రెక్లెస్‌ గా.. అప్సెట్‌ గా ఉంది?

ఇవే ప్ర‌శ్నల్ని సూటిగా సంధించారు పిచ్చి ఫాలోవ‌ర్స్. తాజాగా బాలీవుడ్ స్పెష‌లిస్ట్ ఫోటోగ్రాఫ‌ర్ కం వీడియోగ్రాఫ‌ర్‌ వైర‌ల్ భ‌యాని రివీల్ చేసిన ఓ వీడియోలో బాల‌య్య క‌థానాయిక రాధిక ఆప్టే తీరుతెన్నుల‌పై అభిమానుల్లో జోరుగా డిబేట్ సాగుతోంది. మీడియా ముందే యాటిట్యూడ్‌?  చూపించింది అంటూ కామెంట్లు ప‌డిపోతున్నాయి. ఒక చిన్న బైట్ ప్లీజ్.. అస‌లేం జ‌రిగింది? త‌నూశ్రీ విష‌యంలో అని ప్ర‌శ్నించ‌బోయిన మీడియా వాళ్లను త‌ప్పించుకుంటూ పారిపోతోంది. స‌మీపంలోని లిఫ్ట్ ఎక్కేసి స‌ర‌స‌రా వెళ్లిపోయింది.

దాంతో ఆ వీడియోనే వైర‌ల్ భ‌యానీ ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో పోస్ట్ చేశారు. వీడియో వీక్షించిన వాళ్లంతా.. ఇదేం యాటిట్యూడ్? ఎందుక‌లా అప్‌ సెట్ గా ఉంది? త‌నూశ్రీ కాంట్ర‌వ‌ర్శీ గురించి త‌న‌ని అడ‌గ‌కూడ‌దా?  వెరీ అన్ ప్రొఫెష‌న‌ల్‌. ఫోటోగ్రాఫ్ ఇవ్వ‌డానికే ఎందుకంత ఇదైపోతోంది? అంటూ ప్ర‌శ్నించారు. మొత్తానికి రాధిక‌లోని రుస‌రుస‌కు కార‌ణ‌మేంటో మాత్రం ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. లైంగిక వేధింపుల వ్య‌వ‌హారంలో త‌నూశ్రీ‌కి అండ‌గా నిలిచి నానాని అపోజ్ చేసింది రాధిక‌. ఆ క్ర‌మంలోనే మీడియా త‌నని ప్ర‌శ్నించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే రుస‌రుస‌లాడుతూ అక్క‌డి నుంచి స్కిప్ కొట్టేస్తోంది. క‌నీసం ఫోటోల‌కు ఫోజులివ్వ‌కుండా. ఇక తాను కూడా వేధింపుల్ని ఎదుర్కొన్నాన‌ని రాధిక ఇదివ‌ర‌కూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తిని జ‌నం మ‌ర్చిపోలేదు. టాలీవుడ్ కి చెందిన అగ్ర‌హీరో అంటూ చాలానే పెద్ద ర‌చ్చ చేసింది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News