ఫోటో స్టొరీ: టామీ షర్టులో ముంబై హటీ

Update: 2018-11-29 05:08 GMT
చక్కనమ్మ చిక్కిన అందమే.. అన్న చందంగా అందాల భామ ఏ డ్రెస్ వేసుకున్నా అందమే. బికినీ వేసుకున్నా జీన్స్ మైక్రో.. మినీలు వేసుకున్నా.. ఆఖరికి పట్టుచీర కట్టుకొని హొయలు పోయినా అందమే. ఇలాంటివి ఎన్ని రకాల డ్రెస్ లు ఉన్నాయో అన్నిటినీ వేసుకొని ప్రేక్షకులను మెప్పించిన భామ రాధిక ఆప్టే.  ఆఫ్ లైన్లో మాట్లాడుకుంటే అసలేవీ లేకుండా కూడా మెప్పించిదనుకోండి.. అది వేరే విషయం!

తాజాగా రాధిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. దానికి ఇలా క్యాప్షన్ ఇచ్చింది. "హలో పాట్నా.. బోరింగ్ రోడ్ లో నూతన టామీ హిల్ ఫిగర్ స్టోర్ ఓపెనింగ్ రేపే. అక్కడికి రావడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను.  రేపు 3 pm కల్లా అక్కడ ఉంటాను."  మరి టామీ స్టోర్ ఓపెనింగ్ కు వెళ్తూ అదే బ్రాండ్ డ్రెస్ వేసుకోకుంటే ఎలా? అందుకే ఒక నేవీ బ్లూ కలర్ టామీ హిల్ ఫిగర్ స్వెట్ షర్టు వేసుకొని సోఫాలో స్టైల్ గా కూర్చుంది.  భలేగా నవ్వింది.  కానీ నో ప్యాంట్.

ఇక్కడ రాధిక స్టైల్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. తను కూర్చున్న స్టైల్ లో పాదాలను మామూలుగా వదిలేస్తారు చాలామంది. కానీ రాధిక మాత్రం పాదాలను ఒక స్ట్రెయిట్ లైన్ లా పెట్టింది. ఇక ఫోటో తీసిన లొకేషన్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గది కాకపోయినా ఒక సాధారణ సోఫాలోనే అయినా ఈ రేంజ్ లుక్ తీసుకురావడం అంటే ఆ ఫోటో తీసిన వ్యక్తి టాలెంట్ ను మనం అర్థం చేసుకోవచ్చు.  నెటిజనులకు కూడా ఈ ఫోటో బాగానే నచ్చిందండోయ్.. 16 గంటల్లోనే 2.3 లక్షల లైకులు వచ్చాయి.


Tags:    

Similar News