ఇటీవలి కాలంలో యాక్టింగ్ కం సింగింగ్ అనేది ప్యాషన్ అయిపోయింది. ఉత్తరాది, దక్షిణాది అన్నిచోట్లా మల్టీ ట్యాలెంటెడ్ స్టార్స్ ఎక్కువైపోతున్నారు. ఎవరి సినిమాలకు వాళ్లు పాటలు పాడేసుకుంటున్నారు. ముఖ్యంగా మమతా మోహన్‌దాస్, ఆండ్రియా, శ్రద్ధాకపూర్, ఆలియాభట్, శ్రుతిహాసన్, కలర్స్ స్వాతి ఇలా నాయికలంతా వీలున్నప్పుడల్లా తమ సినిమాల్లో పాటలు పాడేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాధిక అప్టే పేరు కూడా చేరిపోతోంది. రాధిక ప్రస్తుతం సంగీతంలో శిక్షణ పొందుతోంది. దానికోసం ఓ శిక్షకుడిని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుంటోంది.
ఇదే విషయమై తను ఏం చెప్పిందంటే.. నాకు చిన్నప్పట్నుంచి సంగీతం అంటే ప్రాణం. నాయనమ్మ గాయని కం మ్యూజిక్ టీచర్. తను మ్యూజిక్ క్లాస్‌లు చెప్పేటప్పుడు నేను కూడా వెళ్లేదాన్ని. అందరు విద్యార్థుల్లానే బుద్ధిగా సంగీతం నేర్చుకునేదాన్ని. కానీ కాలక్రమంలో ముంబై వచ్చి నటనలో కెరీర్ వెతుక్కునే క్రమంలో సంగీతానికి దూరమైపోయాను. ఇప్పుడు మళ్లీ బుద్ధి పుట్టింది. ఒకటే ధ్యాసతో సంగీత సాధన చేస్తున్నా అని చెప్పింది. ఒకవేళ నటిగా అవకాశాలు తగ్గితే ముందుగానే ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తోందేమో! అన్నట్టు ఇప్పటికే బాలయ్య సరసన రెండు సినిమాల్లో నటించింది ఈ భామ. లెజెండ్, లయన్ చిత్రాల్లో రాధిక కీలకపాత్రలు పోషించింది. ఆ టైమ్‌లో సంగీత ప్రియుడైన బాలయ్యను మెప్పించలేకపోయానే అని మదనపడిందేమో! తన గానామృతంలో హీరోల్ని ముంచెత్తాలని ప్లాన్ చేస్తోందేమో?