ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో ప్రతిభ గల నటిగా రాధికా ఆప్టేకు పేరుంది. పాత్ర కోసం ప్రాణమైనా ఇస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. అప్పట్లో పార్చెడ్ అనే చిత్రంలో ఏకంగా నగ్నంగా నటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆమెకు ఎంత ప్రతిభా ఉన్నా కానీ వివాదాలు కూడా కొదవలేకుండా ఉన్నాయి.
రాధిక ఆప్టే బోల్డ్ గా నటించి యువతను పిచ్చెక్కించడమే కాదు.. అంతే బోల్డ్ గా మాట్లాడి అందరికీ షాక్ ఇస్తుంటుంది. కాస్టింగ్ కౌచ్ - మహిళా నటులపై వేధింపుల విషయంలో రాధికా ఆప్టే తరచూ మాట్లాడుతూ వివాదాలు రేకెత్తిస్తోంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రాధికా ఆప్టే తనకు ఇండస్ట్రీలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడీ మాటలు దుమారం రేపుతున్నాయి.
హాలీవుడ్ ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే.. దీనిపైనే రాధిక తన మనోభావాలు వెల్లడించింది. బాలీవుడ్ లో కూడా ‘మీటూ’ కార్యక్రమం పై ఎందుకు హీరోయిన్లు - నటీమణులు స్పందించడం లేదని రాధిక ప్రశ్నించింది. అంతేకాదు చిత్ర పరిశ్రమలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ‘ఓ చిత్ర షూటింగ్ సమయంలో నాకు నడుము నొప్పి వచ్చింది.. అయినా భరిస్తూ ఆ రోజు షూటింగ్ ముగించాను. చివరి టేక్ పూర్తయిన తర్వాత నా రూమ్ కు బయలు దేరాను. అదే చిత్రంలో నటిస్తున్న మరో నటుడు లిఫ్ట్ లో నాతో పాటు ఎక్కాడు.ఏదైనా సాయం కావాలంటే చెప్పు. అర్ధరాత్రి అయినా వచ్చి నడుము మసాజ్ చేస్తా’ అని అసభ్యంగా మాట్లాడాడని రాధిక బాంబు పేల్చింది. చిత్రం యూనిట్ లోని వారందరికీ ఈ విషయం వివరించానని రాధిక తెలిపింది.
ఈ విషయం చిత్రం యూనిట్ లో దుమారం రేగడంతో పెద్దవారు పిలిచి ఆ నటుడిని మందలించారని రాధిక చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఆ నటుడు వచ్చి తనకు క్షమాపణ చెప్పాడని వివరించింది. అతడు నాతో మాట్లాడిన మాటలు ఎంత అసభ్యకరమైనవో చూస్తే అతడు పెరిగిన వాతావరణం అలాంటిదని రాధిక తెలిపింది. మీటూ లో భాగంగా అందరూ తమకు సినీ ఇండస్ట్రీలో ఎదురైన లైంగిక వేధింపులు బయటకు చెప్పాలని రాధిక కోరింది. ఇప్పుడు రాధిక మాట్లాడిన మాటలు ఏ హీరో గురించో అని బాలీవుడ్ మీడియా ఆరాతీస్తోంది.