స్పై ఏజెంట్‌ గా మారిన హాట్‌ బ్యూటీ

Update: 2019-06-24 05:25 GMT
బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో కూడా సినిమాలు చేసిన రాధిక ఆప్టే హాలీవుడ్‌ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు హాలీవుడ్‌ మూవీ 'లిబర్టే : ఏ కాల్‌ టు స్పై' లో నటించింది. ఆస్కార్‌ నామినేటెడ్‌ డైరెక్టర్‌ అయిన లిడియా డీన్‌ పిల్చర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లిబర్టే చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఈ చిత్రం రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ. ఆ సమయంలో జనాల పరిస్థితి.. నాయకుల ఆదిపత్య కాంక్షను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రంలో రాధిక ఆప్టే ఇండియన్‌ ముస్లీం స్పై ఏజెంట్‌ పాత్రను పోషిస్తోంది. ప్రాన్స్‌ లో ఈమె స్పై ఆపరేషన్స్‌ నిర్వహించనుంది. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన ప్రెస్‌ మీట్‌ జరిగింది. ఆ సందర్బంగా రాధిక ఆప్టే తన లుక్‌ ను రివీల్‌ చేయడం జరిగింది. రాధిక ఈ లుక్‌ లో చాలా విభిన్నంగా కనిపించడంతో పాటు.. సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. రెండవ ప్రపంచ యుద్దం కాలం నాటి పాత్రలు మరియు సన్నివేశాలు చాలా సహజంగా కనిపించేలా దర్శకుడు లిడియా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News