ఇద్దరు అగ్ర నటుల సినిమాలు విడుదలవుతున్నాయంటే ఉండే అంచనాలు అన్నిఇన్ని కావు. అందులోకి పోటాపోటీగా వస్తున్న సినిమాలంటే అటు అభిమానుల్లోనే కాదు.. ఇటు ప్రేక్షకుల్లోనే విపరీతమైన ఆసక్తిని పెంచుతుంది. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఖైదీ.. శాతకర్ణిలు పుట్టించిన వేడి ఎంతో అందరికి తెలిసిందే. దాదాపు ఇలాంటి ఫీవర్ నే తెచ్చింది.. తాజాగా విడుదలైన.. షారూక్ ‘రయిస్’.. హృతిక్ ‘కాబిల్’ చిత్రాలు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు చిత్రాలు సో.. సోగా నడవటం గమనార్హం. వసూళ్ల వర్షం కురుస్తుందని చెబుతున్నప్పటికీ.. ఈ రెండుసినిమాలకు వస్తున్న కలెక్షన్ల గణాంకాలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవనే చెబుతున్నారు. ఈమధ్యనే విడుదలైన అమిర్ ఖాన్ దంగల్ కలెక్షన్ల దగ్గరకు ఈ రెండింటిలో ఏదో ఒకటి వెళుతుందన్న అంచనాలు వినిపిస్తున్నప్పటికీ.. అదేమీ నిజమయ్యే సూచనలు కనిపించటం లేదనే చెప్పాలి.
ఫస్ట్ వీక్ ఎండ్ పూర్తి అయినప్పటికీ రూ.100కోట్ల మార్క్ కు దూరంగా ఉన్న తీరు చూస్తే.. ఈ ఇద్దరు అగ్ర నటుల చిత్రాల సరాసరి కలెక్షన్లు అయినా వస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆల్ టైం రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూ దంగల్ దాదాపుగా రూ.400కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందులో సగం కలెక్షన్లు ఈ వచ్చినా గొప్పే అంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలై.. చతికిల పడిన చిత్రాలుగా రయిస్.. కాబిల్ నిలుస్తాయనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/