ఆ పాటను ఐదు కోట్ల మంది చూశారు

Update: 2017-01-03 09:30 GMT
చాన్నాళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ ఒక బ్లాక్ బస్టర్ హిట్టు అందుకునేలా కనిపిస్తున్నాడు. అతడి కొత్త సినిమా ‘రయీస్’పై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గత కొన్నేళ్లలో ఏ షారుఖ్ సినిమాకూ లేనంత పాజిటివ్ బజ్ ఈ సినిమాకు వచ్చింది. దీని టీజర్.. ట్రైలర్ అన్నీ కూడా భలే ఆసక్తికరంగా అనిపించాయి. ‘రయీస్’ పాటలు కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి. రిలీజ్ నెలలోకి వచ్చేసరికి ప్రమోషన్ల జోరు కూడా పెంచారు.

ఈ సినిమాలో సన్నీ లియోన్ ‘లైలా మే లైలా’ అనే ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. దీని వీడియో సాంగ్ సగం నిడివితో రిలీజ్ చేశారు. అది యూట్యూబ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఈ పాటను ఇప్పటికే 5 కోట్ల మంది చూడటం విశేషం. కేవలం వారం రోజుల్లోనే లైలా.. పాట 50 మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకోవడం విశేషం. సన్నీ అందచందాలు.. షారుఖ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సన్నీకి డ్యాన్స్ పెద్దగా రాకపోయినా.. తన ఒంపుసొంపులతో బాగానే కుర్రాళ్లకు గాలం వేసింది. సినిమాలో ఫుల్ సాంగ్ మరింత ఆకర్షణీయంగా ఉంటుందని.. అది మంచి టైమింగ్‌ లో వస్తుందని అంటున్నాడు దర్శకుడు రాహుల్ డోలాకియా. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుఖ్ ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తున్నాడు. పాకిస్థాన్ అమ్మాయి మహీరా ఖాన్ ఇందులో కథానాయికగా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News