వీళ్లింతే. మారరు. ట్విట్టర్లో ఒకరిని ఒకరు పొగిడేసుకుంటూ, బయట కనిపించినప్పుడు హగ్గులు ఇచ్చుకుంటూ రచ్చ చేసే ఖాన్స్ వీరు. ఎవరో కాదు ఆ నవాబులు.. మన సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్.. ఇక వీరి మధ్యన ఇప్పుడు ఒక రిలీజ్ డేట్ చిచ్చుపెడుతోంది. దానికోసం ఇద్దరూ పెద్ద యుద్దమే చేసుకుంటున్నారు.
మ్యాటర్ ఏంటంటే.. ఈరోజు బజరంగీ భాయ్‌జాన్ సినిమాతో వస్తున్నాడు సల్లూ. ఇదే సంవత్సరం డిసెంబర్ 18న దిల్వాలే సినిమాతో వస్తున్నాడు షారూఖ్. అయితే ఈ సినిమాలతో గొడవేం లేదు. కాని వచ్చే సంవత్సరం ఈద్ పండుగను పురస్కరించుకుని నేను ''రయీస్'' సినిమాతో వస్తా అంటూ ఓ అర్నెల్ల నుండే ప్రకటించేసుకున్నాడు షారూఖ్. ఇది విని సల్లూ భాయ్‌కి మండిపోయింది. ఈద్ పండుగకు ప్రతీసారీ నేనే వస్తున్నా కాబట్టి, నేను కూడా ''సుల్తాన్'' అనే సినిమాతో వస్తా అంటూ ఆయన కూడా ప్రకటించేశాడు.
కట్ చేస్తే.. ఓ రెండు వారాల క్రితం.. ''సుల్తాన్'' సినిమా టీజర్‌తో వచ్చేశాడు సల్లూ. కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమాగా అప్పుడే దానికి పాపులార్టీ తెచ్చేశాడు. మరి షారూఖ్ తక్కువ తిన్నాడా.. మనోడు కూడా వెంటనే ''రయీస్'' టీజర్‌ను దించాడు. నిన్ననే రిలీజ్ అయ్యింది. డిసెంబర్లో వచ్చే దిల్వాలే సినిమా టీజర్ కాదు కదా ఒక్క వాల్ పేపర్ కూడా ఇంకా రాలేదు కాని.. అప్పుడు రయీస్ టీజర్ ఏంది దొర? టీజర్స్‌తో వార్ అంటే ఇదే!!