కార్తీక్ సుబ్బరాజ్ సూపర్ హిట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'జిగర్తాండ'కు సీక్వెల్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ కి 'జిగర్తాండ డబుల్ ఎక్స్' అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మేకర్స్ ప్రత్యేక టీజర్ వీడియోను తాజాగా విడుదల చేశారు.
'ఏ కైండ్ ఆఫ్ టీజర్' (ఒక రకమైన టీజర్) అనే ట్యాగ్ లైన్ తో విడుదలైన ఈ టీజర్ లో SJ సూర్య - రాఘవ లారెన్స్ నువ్వా నేనా? అంటూ పోటీపడుతూ ఫోజులిచ్చారు. జిగర్తాండ పార్ట్ 1 మాదిరిగానే టీజర్ లో రాఘవ తన శత్రువుపై కెమెరాను ఆయుధంగా ఉపయోగించడం టీజర్ లో కనిపిస్తుంది. అయితే సీక్వెల్ గురించి మాట్లాడే ముందు జిగర్తాండ నేపథ్యం గురించి తెలుసుకోవాలి.
2014లో విడుదలైన 'జిగర్తాండ'లో సిద్ధార్థ్- బాబీ సింహా- లక్ష్మీ మీనన్- కరుణాకరన్- గురు సోమసుందరం తదితరులు నటించారు. ముఖ్యంగా నటుడు విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సినిమా తీయడానికి నిజ జీవిత గ్యాంగ్ స్టర్ల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఒక ఔత్సాహిక ఫిలింమేకర్ కథ దీనికి స్ఫూర్తి. అతని పరిశోధన సమయంలో అసలు కనికరం అన్నదే లేని గ్యాంగ్ స్టర్ సేతు చేతిలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత కథ భయంకరమైన మలుపులు తిరుగుతుంది.
ఈ సినిమాలో కీలక పాత్రను పోషించిన బాబి సింహా ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకోగా.. ఉత్తమ ఎడిటర్ గా వివేక్ హర్షన్ కు జాతీయ అవార్డు లభించింది. ఇప్పుడు సీక్వెల్లో ఎస్.జే సూర్య- రాఘవ లారెన్స్ లాంటి విలక్షణమైన నటులను సుబ్బరాజ్ ఎంపిక చేయడం ఉత్కంఠను పెంచుతోంది. తాజా టీజర్ లో ఆ ఇద్దరూ డాన్ ల తరహా ఫోజులతో అదరగొట్టారు. ఎస్.జే సూర్య స్టైలిష్ గా సూట్ లో కనిపించగా... రాఘవ లారెన్స్ సమ్మెటతో ఆయుధాలు తయారు చేసే మొరటోడిగా కనిపించాడు.
అతడి ముక్కుపుడక మాసిజాన్ని ఎలివేట్ చేసింది. ఇక ఈ టీజర్ కి రీరికార్డింగ్ పూర్తిగా హాలీవుడ్ కౌబోయ్ చిత్రాల ఎలివేషన్ ని తెచ్చిందని చెప్పాలి. తనను హతమార్చేందుకు తరుముకొస్తున్న దుండగులు ప్రజలు పోలీసులను చూసి ధీమాగా భూమిలోంచి కెమెరా అనే ఆయుధాన్ని తీస్తాడు రాఘవ లారెన్స్. అక్కడితే టీజర్ కి కట్ పడింది. మొత్తానికి టీజర్ క్యూరియాసిటీని పెంచిందనడంలో సందేహం లేదు.
కార్తీక్ సుబ్బరాజ్ చివరిగా విక్రమ్ తో 'మహాన్' తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతకుముందు రజనీకాంత్ తో 'పేట' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.