తెలుగులో అప్పట్లో 'స్టైల్' 'మాస్' వంటి సినిమాలతో తెగ హల్చల్ చేశాడు కొరియోగ్రాఫర్ లారెన్స్. ఆ దెబ్బతో మనోడికి తెగ క్రేజ్ వచ్చేసింది. ఆ తరువాత చాలామంది పెద్ద పెద్ద స్టార్లు కూడా లారెన్స్ తో సినిమాలు చేయాలని తెగ ఊగారు కాని.. 'డాన్' వంటి సినిమా దెబ్బతో లారెన్స్ అంటే భయం వేసింది. ఆ తరువాత మనోడు తమిళనాడుకు చెక్కేసి పూర్తిగా దెయ్యాల సినిమాలు తీయడంలో మునిగిపోయాడు.
ఇక మధ్య మధ్యలో తెలుగుకు వచ్చి చాలా బీభత్సక భయానక సినిమాలను తీశాడు లారెన్స్. నాగార్జున తో 'డాన్'.. ప్రభాస్ తో 'రెబెల్' తీసి.. తెలుగు ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చాడు లారెన్స్. ఆ రెండు సినిమాలూ చూశాక అసలు తెలుగులో మనోడితో ఏ స్టార్ సినిమా చేస్తాడని మాత్రం అనుకోరు. కాకపోతే ఇప్పుడు తనకు ఒకప్పుడు సాయం చేసిన బెల్లంకొండ సురేష్ ను ఆదుకోవడానికి.. ఆయన కొడుకు శ్రీనివాస్ హీరోగా లారెన్స్ ఒక డైరక్ట్ తెలుగు సినిమాను తీస్తున్నాడట. ఈ సినిమా మాస్ అండ్ స్టైల్ తరహాలో ఉంటే పర్లేదుగాని.. లేకపోతే ఆడియన్స్ బాగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆడియన్స్ ను జాగ్రత్తగా చూసుకో లారెన్స్.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికొస్తే.. ఒక్కో సినిమాతో కూడా ప్రూవ్ చేసుకోకుండానే మనోడు వరుసగా సినిమాలు మాత్రం బాగానే లైన్లో పెట్టుకుంటున్నాడు. వీటితో పాటు మంచి కథలను ఆ సినిమాలో ఉండేలా చూసుకుంటే ఇంకా బాగుంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/