శతమానం భవతి తోనే దర్శకేంద్రుడి ఎంట్రీ ఉండాల్సింది

Update: 2021-10-11 12:30 GMT
వంద సినిమాలకు పైగా తెరకెక్కించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కొన్నాళ్ల క్రితం వరకు స్టేజ్ ఎక్కితే మాట్లాడేవాడు కాదు.. ఆయన్ను మాట్లాడించేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించే వారు. కాని ఆయన మాత్రం ఏదైనా సినిమా వేడుకకు వెళ్తే చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పి ముగించే వారు. ఆయన తీరు ఇప్పుడు పూర్తిగా మారింది. అన్ని సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు ఎప్పుడు కూడా సినిమాల్లో నటించాలని అనుకోలేదు. కాని ఈమద్య ఆయనలో చాలా మార్పు వచ్చింది. బుల్లి తెర షో ల్లో గడ గడ మాట్లాడేయడంతో పాటు ఆయన ఎన్నో షో ల్లో మరియు పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా మాట్లాడేస్తూనే ఉన్నారు. రాఘవేంద్ర రావు మాటలు మాట్లాడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలని.. వింటూ ఉండాలని అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత రాఘవేంద్ర రావు నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. పెళ్లిసందD సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

తాను నిర్మిస్తున్న సినిమా పెళ్లిసందD తో నటుడిగా అరంగేట్రం చేయబోతున్న రాఘవేంద్ర రావు కు గతంలో పలు సినిమాల నుండి ఆఫర్లు వచ్చాయట. ముఖ్యంగా దిల్‌ రాజు నుండి శతమానం భవతి సినిమా నుండి ఆఫర్‌ వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా దిల్‌ రాజు వెళ్లడించాడు. నేను రాఘవేంద్ర రావు గారిని శతమానం భవతి సినిమాలో ప్రకాష్ రాజ్ నటించిన పాత్రలో నటింపజేయాలనుకున్నాను. అందుకోసం ఆయన్ను చాలా రిక్వెస్ట్‌ చేశాను. ఆయన అసలు ఆ సమయంలో నటనపై ఆసక్తి లేదన్నట్లుగా రిప్లై ఇచ్చారు. ఆయన చేయను అని చెప్పిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ లో ప్రకాష్‌ రాజ్ ను తీసుకున్నట్లుగా దిల్‌ రాజు పెళ్లిసందD ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సందర్బంగా చెప్పుకొచ్చాడు.

శతమానం భవతి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వకున్నా ఆయన ఇప్పటికి అయినా నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు నేను 50 సినిమాలు నిర్మించాను. అందులో ఆయనతో ఒక్క సినిమాను కూడా చేయలేక పోయినందుకు బాధ గా ఉందంటూ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశాడు. పెళ్లిసందD సినిమాతో ఆయన నటుడిగా వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లుగా దిల్‌ రాజు చెప్పుకొచ్చాడు. నా కథల విషయంలో రాఘవేంద్ర రావు గారి సలహాలు మరియు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నిర్మాతగా నా జెర్నీలో ఆయన సలహాలు చాలా ఉపయోగపడ్డాయని దిల్‌ రాజు చెప్పుకొచ్చాడు. దిల్‌ రాజు నిర్మాణంలో వచ్చిన శతమానం భవతి సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాతోనే రాఘవేంద్ర రావు ఎంట్రీ జరిగి ఉంటే బాగుండేది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News