'ఎఫ్‌2' రిపీట్‌ ఆడియన్స్‌ కు కారణం ఇదే : రాఘవేంద్ర రావు

Update: 2019-03-04 08:21 GMT
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్‌ 2' చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 80 కోట్లకు పైగా షేర్‌ ను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. దిల్‌ రాజు బ్యానర్‌ లో రూపొంది 50 డేస్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభాలు దక్కించుకున్నారు. 50 రోజుల వేడుకలో చిత్ర హీరోయిన్స్‌ తో పాటు రాఘవేంద్ర రావు మరియు మరో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమద్య కాలంలో బయ్యర్లు ఈస్థాయిలో లాభాలను దక్కించుకోవడం ఇదే అయ్యి ఉంటుంది. మంచి సినిమాకు మంచి నిర్మాత అవసరం చాలా ఉంది. మంచి నిర్మాత దొరికినప్పుడే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. నిర్మాతగా దిల్‌ రాజు ప్లానింగ్‌ చాలా పక్కాగా ఉంటుందని మరోసారి నిరూపితం అయ్యింది. తక్కువ బడ్జెట్‌ తో ఈస్థాయి వసూళ్లను రాబట్టడం నిజంగా అభినందనీయం. తాను గతంలో చేసిన పెళ్లి సందడి మూవీ కూడా చిన్న బడ్జెట్‌ మూవీ, అది కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అన్నాడు. ఈ చిత్రానికి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ రావడానికి మరో కారణం హీరోయిన్స్‌ తమన్నా, మెహ్రీన్‌. వీరిద్దరు కూడా బికినీల్లో చాలా అందంగా కనిపించారు. వీరిద్దరిని దర్శకుడు చాలా గ్లామర్‌ గా అందంగా చూపించాడు. జిమ్‌ కు పోతే ఆరోగ్యం బాగుంటుంది, అనీల్‌ రావిపూడి సినిమాలకు వెళ్లినా ఆరోగ్యం బాగుంటుందని నేను అంటాను. అనీల్‌ చేసిన ప్రతి సినిమాను నేను రెండు మూడు సార్లు చూశాను. చాలా బాగా నచ్చాయి అన్నాడు.

మరో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఒక కార్యక్రమంలో అనీల్‌ నాకు కనిపించి మీరు తీసిన పెళ్లాం ఊరెళ్తే సినిమా ఇన్సిపిరేషన్‌ తో ఒక సినిమా తీయబోతున్నట్లుగా చెప్పాడు. అప్పుడే ఆ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నాను. దిల్‌ రాజు గారు ట్యాలెంట్‌ ఎక్కడ ఉన్నా కూడా వెదికి మరీ పట్టుకుంటారు. మంచి ట్యాలెంట్‌ ఉన్న వారికి దిల్‌ రాజు మంచి మార్గంగా నిలిచారు. ఈ చిత్రం ఇంతటి విజయాన్ని సాధించినందుకు యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:    

Similar News