డ్రగ్స్ కేసు: హీరోయిన్ బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన సుప్రీంకోర్టు..!

Update: 2021-01-09 08:10 GMT
శాండిల్ వుడ్ డ్రగ్స్ మాఫియా కేసులో హీరోయిన్ రాగిణిని ద్వివేదిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాగిణి డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. బెయిల్ మంజూరు చేయమని కోరుతూ కోర్టులను ఆశ్రయించింది. ఇప్పటికే రాగిణి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు కూడా బెయిల్ పిటీషన్ ని తిరస్కరించడంతో ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో బెయిల్ కోసం చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైయ్యిందని తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రాగిణితో పాటు మరో హీరోయిన్ సంజనా గల్రానీ బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. అనారోగ్య కారణాలతో సంజనాకు బెయిల్ ఇచ్చారు కానీ రాగిణికి ఇవ్వలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. న్యాయమూర్తి ఎల్. నాగేశ్వర్ రావ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ చేసింది. రాగిణి మీద కావాలనే తప్పుడు సాక్షాలతో కేసులు నమోదు చేశారని.. ఇప్పటికే నటి రాగిణి అరెస్టు అయ్యి 90 రోజులు దాటిపోయిందని.. ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని న్యాయవాదులు సుప్రీంకోర్టుకి తెలిపారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో రాగిణి మరో వారం రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Tags:    

Similar News